డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రపంచదేశాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపారు. ప్రత్యేకంగా,భారతీయులను టార్గెట్గా చేసుకుని, పలు సంచనల నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీంతో ఇటీవల ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) భారత్ లోని కొన్ని వర్గాలను,టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా నవారో చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అబద్ధమని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఫ్యాక్ట్ చెక్’ వెల్లడించింది. దీనిపై,ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ఎవరు తప్పు చేసినా కూడా ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ దాన్ని సరిచేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని తేల్చి చెప్పారు. గ్రోక్ మరింత ఫ్యాక్ట్ చెక్ సమాచారాన్ని ప్రజలు అందిస్తోందని చెప్పారు.
నవారో వ్యాఖ్యలు అవాస్తం
భారత్ విధిస్తున్న సుంకాల ప్రభావం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. తమ లాభం కోసమే రష్యా నుంచి ఆయిల్ ను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా,చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తోందని’ నవారో పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టును ఎక్స్ ఫ్యాక్ట్ చేసింది. నవారో చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేసింది. భారత్ తమ ఇందన,భద్రత కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని చెప్పింది.

భారత్ ఎలాంటి ఆంక్షలు ఉల్లంఘించలేదు.
భారత్ ఎలాంటి ఆంక్షలు ఉల్లంఘించలేదని తేల్చిచెప్పింది సోషల్ మీడియా! అంతేకాదు అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటోందని పేర్కొంది. నవారో
చేసిన,వ్యాఖ్యలు కపటమైనవిగా ఉన్నాయని పేర్కొంది. దీనిపై స్పందించిన నవారో ఎక్స్ పై విరుచుకుపడ్డారు. ఎలాన్ మస్క్ (Elon Musk) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ ఫ్యాక్ట్ చెక్
ఇచ్చిన సమాచారాన్ని ఒక చెత్త అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మొదటి నుంచి ట్రంప్ తీరే వేరు
భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చాలామంది అమెరికా రాజకీయ విశ్లేషకులు సైతం భారత్పై అధికంగా టారిఫ్ లు విధించడాన్ని తప్పుబట్టారు. మరోవైపు పీటర్ నవారో, బెసెంట్ లాంటి వారైతే భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల పలు వర్గాలను టార్గెట్ చేస్తూ నవారో చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కాగా చైనాలో ఇటీవల జరిగిన సమావేశానికి భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ల భేటీతో ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. అమెరికాకు వ్యతిరేకంగా కుట్రపడుతున్నారని ఆరోపించారు. ఆ స్నేహం ఎక్కువ కాలం నిలవదని, మోదీ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ ఆస్తి విలువ ఎంత?
2025 నాటికి ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరిగా, $200 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి కలిగిన వ్యక్తి.
స్పేస్‌ఎక్స్ ప్రధాన లక్ష్యం ఏమిటి?
స్పేస్‌ఎక్స్ లక్ష్యం అంతరిక్ష ప్రయాణ ఖర్చును తగ్గించడం, భవిష్యత్తులో మనుషులు మంగళగ్రహం (Mars) మీద నివసించేలా చేయడం.
Read hindi news: hindi.vaartha.com
Read also: