हिन्दी | Epaper

Kumbh Mela Monalisa: మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

Rajitha
Kumbh Mela Monalisa: మోసాలిసా పెళ్లి పై  డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ప్రయాగరాజ్ మహా కుంభమేళా వేళ తన ముగ్ధమనోహరమైన చిరునవ్వుతో ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన మోనాలిసా భోంస్లే తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత ఏడాదిన్నర కాలంగా ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ, కేరళలోని తిరువనంతపురంలో పోలీసుల రక్షణ మధ్య పెళ్లి చేసుకుంది. మొదట సివిల్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట, ఆ తర్వాత ఆలయంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం విశేషం. అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Read also: The Bluff: ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

Kumbh Mela Monalisa: Sensational comments on Monalisa's wedding

Kumbh Mela Monalisa: Sensational comments on Monalisa’s wedding

దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన ఆరోపణలు

మోనాలిసా వివాహంపై ఆమెను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది కేవలం ప్రేమ వివాహం మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. మోనాలిసాను ప్రలోభాలకు గురిచేసి ఈ పెళ్లి చేసుకున్నారని, ఇది ఒక రకమైన లవ్ జిహాద్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే ఎంతో కష్టపడి ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చి సినీ అవకాశాలు కల్పించానని, అయితే తన వద్ద పనిచేసిన ఒక వ్యక్తే ఆమెను తప్పుదోవ పట్టించి ఈ పెళ్లికి పురికొల్పాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సినీ కెరీర్ మరియు ప్రస్తుత వివాదం

వైరల్ సెన్సేషన్‌గా మారిన తర్వాత మోనాలిసాకు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘నాగమ్మ’ బాలీవుడ్‌లో ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ వంటి భారీ ప్రాజెక్టులలో నటిస్తోంది. తెలుగులో కూడా ‘లైఫ్’ అనే సినిమా ద్వారా మన ముందుకు రానుంది. ఇంతటి మంచి కెరీర్ ఉన్న సమయంలో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని సనోజ్ మిశ్రా అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై మోనాలిసా గానీ, ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ
2:13

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

విజయ్ పార్టీలోకి త్రిష?

విజయ్ పార్టీలోకి త్రిష?

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

📢 For Advertisement Booking: 98481 12870