ఉత్తర కొరియా శక్తి ప్రదర్శన – హ్వాసోంగ్-20 క్షిపణి ఆవిష్కరణ
అంతర్జాతీయ ఒత్తిడుల మధ్య కూడా ఉత్తర కొరియా తన సైనిక సామర్థ్యాన్ని నిరూపించడంలో వెనుకడుగు వేయడం లేదు. రష్యా, చైనా (China) వంటి మిత్రదేశాల మద్దతుతో ధైర్యంగా ముందుకు సాగుతున్న కిమ్ జాంగ్ ఉన్,(Kim) తాజాగా తన దేశపు అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్యాంగ్యాంగ్‌లో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించిన సైనిక కవాతులో ‘హ్వాసోంగ్-20’ అనే కొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని (ICBM) ఉత్తర కొరియా ప్రదర్శించింది.ఈ క్షిపణిని దేశపు “అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్ర వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ”గా అక్కడి ప్రభుత్వ మీడియా ప్రకటించింది. దీని వెంటనే సుదూర లక్ష్యాలను ఛేదించగల క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ లాంచర్లు, భూమి-గగనతల క్షిపణులను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్, చైనా ప్రధాని లీ చియాంగ్, వియత్నాం నేత టో లామ్ వంటి ప్రముఖులు హాజరై కిమ్ జాంగ్ ఉన్‌తోపాటు కూర్చొని వీక్షించారు.
Read also: సభలో ఐ లవ్ యు చెప్పిన సింధియా

కిమ్ వ్యాఖ్యలు – రష్యా తరఫున పోరాడిన సైనికులకు ప్రశంసలు
ఈ సందర్భంగా కిమ్ జాంగ్ (Kim) ఉన్ మాట్లాడుతూ, “మా సైన్యం అజేయం. దేశ భవిష్యత్తు కోసం పార్టీ చేసే ప్రతి ప్రయత్నానికి అది బలం ఇస్తోంది” అని పేర్కొన్నారు. విదేశీ యుద్ధ క్షేత్రాల్లో ఉత్తర కొరియా సైనికులు చూపుతున్న ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. రష్యా తరఫున ఉక్రెయిన్‌లో పోరాడుతున్న సైనికులను ఉద్దేశించి కిమ్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. దక్షిణ కొరియా వెల్లడించిన ప్రకారం, ఉక్రెయిన్ యుద్ధంలో సుమారు 600 మంది ఉత్తర కొరియా సైనికులు మృతి చెందగా, వేలమంది గాయపడ్డారని సమాచారం. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విశ్లేషకుడు సియాంగ్-హ్యోన్ లీ ప్రకారం, ఈ సైనిక ప్రదర్శన కేవలం వేడుక మాత్రమే కాకుండా, అమెరికా-దక్షిణ కొరియా కూటమికి ప్రతిస్పందనగా రష్యా-చైనా-ఉత్తర కొరియా మధ్య కొత్త రాజకీయ సమీకరణం బలపడుతోందనే సంకేతమని విశ్లేషించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: