సుప్రీంకోర్టు (supreme)52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice bhushan Gavai) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice bhushan Gavai) రికార్డులకెక్కారు.

రెండో దళిత సీజేఐగా చరిత్రలో నిలిచిన ఘట్టం
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice bhushan Gavai) 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత, భోసలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు. అనతికాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన మునిసిపల్ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. నాగ్‌పుర్ బెంచ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆయన తన పట్టుదలతో సీజేఐ దాకా ఎదిగారు. 2000లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ తరువాత నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రభుత్వ ప్లీడర్ అయ్యారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఇప్పుడు 14 మే 2025న భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీకాలం 2025 నవంబర్ 23వరకు ఉంటుంది. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గవాయ్ (Justice bhushan Gavai) ఆరేళ్లలోనే సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. సంచలన కేసుల తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు.
తండ్రి ఆర్.ఎస్. గవాయ్ – ప్రముఖ రాజనీతిజ్ఞుడు
ప్రముఖ రాజకీయ నాయకుడు, బిహార్, కేరళ గవర్నర్ ఆర్ఎస్ గవాయ్ కుమారుడే సీజేఐ జస్టిస్ గవాయ్(Justice bhushan Gavai) . ఆయన తండ్రి ఆర్ఎస్ గవాయ్ అంబేద్కర్ వాది. అలాగే, పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. ఈ క్రమంలో తన తండ్రిలాగే రాజకీయాల్లోకి వస్తారా? అని అడిగినప్పుడు జస్టిస్ గవాయ్ ఆసక్తికర సమాధానం చెప్పారు. రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి బాధ్యతలను తాను తీసుకోవాలనుకోవడం లేదని పేర్కొన్నారు. ఇతర పదవులన్నీ కూడా సీజేఐ కంటే తక్కువే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఖరికి గవర్నర్ పదవికి కూడా సీజేఐ కంటే తక్కువే చెప్పుకొచ్చారు.
Read Also: Huge loss for Pakistan :భారత్ క్షిపణి దాడుల్లో పాక్‌కు భారీ నష్టం..!