అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) నివాసంపై దాడి కలకలం రేగింది. ఒహియోలోని సిన్సినాటి నివాసంపై దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ దాడిలో పలు కిటికీలు ధ్వంసం అయ్యాయి. ఘటన సమయంలో కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో వారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయింది.
Read also: Samosa : లండన్ లో సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.10లక్షలు, ఇండియన్ సమోసా మజాకా !!

జేడీ వాన్స్ (JD Vance) ఇల్లే లక్ష్యం
ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జేడీ వాన్స్ ఇల్లే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. నిందితుడు ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టినట్లు అక్కడి ఫోటోల ద్వారా స్పష్టం అవుతోంది.
అయితే నిందితుడు ఇంటి లోపలికి ప్రవేశించలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని పోలీసులు వెంటనే వెంబడించి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.ఈ ఘటన పై అమెరికా సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: