జపాన్ పాలక పక్షం అయిన లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి సనే తకాయిచి కొత్త నాయకురాలిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఓటింగ్ లో ఆమె విజయం సాధించారు. దీంతో మొదటి మహిళా ప్రధానిగా 64 ఏళ్ల తకాయిచి పదవిని స్వీకరించనున్నారు. ఐదుగురు అభ్యర్థులు పోటీపడిన ఈ రేసులో ఆమె ఏకైక మహిళా అభ్యర్థి.
పదవీ విరమణ చేస్తున్నప్రస్తుత ప్రధాని షిగేరు ఇషిబా వారసురాలిగా తకాయిని లాంఛనంగా ఎన్నుకోవడానికి అక్టోబరు 15వ తేదీన పార్లమెంట్(Parliament) లో ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం తకాయిచి నాయకత్వం వహించనున్న పార్టీ చీలిపోయిన స్థితిలో ఉంది. ధరలు పెరగడం, ఉదారమైన ఉద్దీపన కార్యక్రమాలు, కఠినమైన వలస నిబంధనలు అందించే ప్రతిపక్షాల వైపు ఆకరి తులవుతున్నారు ప్రజలు. ఈ అంశాలన్నీ ఆమె ముందు సవాళ్లుగా నిలిచాయి. తన విజయోత్సవ ప్రసంగంలో తకాయిచి ఓటర్ల ఆందోళనలను అవకాశంగా మార్చుకోవాలనుకుంటున్నానని ప్రకటించారు.
Read Also: Hot Topic:విజయ్-రష్మిక ఎంగేజ్‌మెంట్: అభిమానులకు షాక్

మంత్రి స్థాయి నుంచి ప్రధాని వరకు..
మాజీ మంత్రిగా పనినిచేసిన తకాయిచి బలమైన జాతీయవాద భావాలుగల స్త్రీగా ఆమె ప్రసిద్ధి చెందారు. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కుదిరిన వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాన్ని సమీక్షించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు తకాయిచి. రాజకుటుంబ వారసత్వం పురుషులకే పరిమతం చేయాలని ఆమె మద్దతిస్తారు. అలాగే సమలింగ వివాహాలను వ్యతిరేకిస్తారు. మహిళలు ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచాలని కోరుతూ మెనోపాజ్ తో తన పోరాటాల గురించి బహిరంగంగా మాట్లాడారు.
ఆమె ఎప్పుడు అధికారంలోకి వస్తారు?
ప్రస్తుత ప్రధానమంత్రి షిగేరు ఇషిబా పదవీ విరమణ తరువాత అక్టోబర్ 15వ తేదీన పార్లమెంట్ ఓటింగ్ ద్వారా పదవి స్వీకరిస్తారు.
ఆమెకు ఎదురున్న ప్రధాన సవాళ్లు ఏవీ?
- ధరల పెరుగుదల
- ఉదారమైన ఉద్దీపన, వలస విధానాలపై ప్రజల ఆందోళనలు
- పార్టీ లో లోపాల కారణంగా పార్థక్యాలు
Read hindi news: hindi.vaartha.com
Read Also: