జపాన్‌లో(Japan) ఇటీవల ఎలుగుబంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది, ముఖ్యంగా అకిటా ప్రావిన్స్‌లో వీటి విస్తృతి ఎక్కువగా ఉంది. అడవుల్లో ఆహార కొరత కారణంగా భల్లూకాలు తరచూ గ్రామాలు, పట్టణ ప్రాంతాలవైపు వస్తున్నాయి. ఫలితంగా, మనుషులపై దాడులు సాధారణంగా మారిపోయాయి. గత ఆరు నెలల్లోనే వందకు పైగా దాడులు చోటుచేసుకుని, 13 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఈ పరిస్థితి ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగించడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది.
Read Also: Earthquake: అండమాన్& నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభం
ఎలుగుబంట్లను పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్(Japan) ప్రారంభించింది. వేటగాళ్లతో పాటు సైన్యాన్ని కూడా ఈ ఆపరేషన్‌లో భాగం చేసింది. భల్లూకాలను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు, వాటి తరలింపులో సైనికులు సహకరిస్తారు. అయితే, వాటిని చంపడానికి తుపాకులు వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కాల్పులకు పరిమిత అనుమతి
అకిటా మరియు ఇవాటే ప్రావిన్సుల్లో మాత్రం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎలుగుబంట్లపై కాల్పులు జరపడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. వేటగాళ్లు స్పందించలేని పరిస్థితుల్లో సైన్యం కాల్పులు జరపవచ్చని తెలిపింది. అలాగే, గిఫు ప్రావిన్సులో డ్రోన్ల(Drones in the province) సాయంతో భల్లూకాలను భయపెట్టే శబ్దాలను సృష్టించి వాటిని దూరంగా తరిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వృద్ధికి కారణాలు
వాతావరణ మార్పులు, శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, ఆహార వనరుల కొరతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు తగ్గిపోవడం వల్ల పండ్ల చెట్లు విపరీతంగా పెరగడం ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఎలుగుబంట్ల ప్రస్తుత స్థితి
1990లలో ప్రభుత్వం సంరక్షణ చర్యలు ప్రారంభించిన తర్వాత ఎలుగుబంట్ల సంఖ్య వేగంగా పెరిగింది. ప్రస్తుతం హెన్షూ ద్వీపంలో సుమారు 42,000, హొక్కైడో ద్వీపంలో 12,000 ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: