జపాన్‌లో(Japan) తీవ్ర హిమపాతం కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై మంచు గడ్డకట్టడంతో నియంత్రణ కోల్పోయిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొని భారీ ప్రమాదానికి దారితీశాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది గాయపడ్డారు. ప్రమాదానంతరం కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి, అనేక వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Read Also: Bangladesh Politics: బంగ్లాదేశ్ భద్రతకు పాకిస్తాన్ అండ, భారత్‌కి స్పష్టమైన సంకేతం
హిమపాతం, మంచు గడ్డకట్టిన రహదారే కారణం..
ఈ ప్రమాదం గున్మా ప్రిఫెక్చర్‌లోని మినాకామి పట్టణ సమీపంలో ఉన్న కన్-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం రాత్రి జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 7:30 గంటల సమయంలో భారీగా కురుస్తున్న మంచు కారణంగా మొదటగా రెండు ట్రక్కులు పరస్పరం ఢీకొన్నాయి. రహదారిపై ఐస్ ఏర్పడటంతో వెనుక నుంచి వచ్చిన వాహనాలు సమయానికి బ్రేకులు వేయలేక వరుసగా ఢీకొంటూ వెళ్లాయి. క్షణాల్లోనే 50కి పైగా వాహనాలు ఈ ప్రమాదంలో చిక్కుకున్నాయి.
ప్రమాదం(Japan) జరిగిన కొద్దిసేపటికే కొన్ని వాహనాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకొని సుమారు 17 వాహనాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు ఏడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో టోక్యోకు చెందిన 77 ఏళ్ల మహిళ మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. గాయపడిన 26 మందిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న ఓ ట్రక్ డ్రైవర్ మాట్లాడుతూ, రోడ్డుపై ఉన్న మంచు కారణంగా వాహనం అదుపు తప్పిందని, వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రాణాల మీద ఆశ వదులుకున్నానని తెలిపారు.
టోక్యోను నిగాటా ప్రిఫెక్చర్‌తో కలిపే కీలక మార్గమైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై కొత్త సంవత్సరం సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రమాదం నేపథ్యంలో రాకపోకలను నిలిపివేసినట్లు NEXCO ఈస్ట్ ప్రకటించింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, ధ్వంసమైన వాహనాలను తొలగించే పనులు జరుగుతున్నాయి. భద్రతా తనిఖీలు పూర్తైన తర్వాతే రహదారిని తిరిగి తెరవనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: