భారతీయ మూలాలు ఉన్న జోహ్రన్ మజ్దానీ న్యూయార్క్ నగర మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మన్హటన్ లోని చారిత్రాత్మక ‘సిటీ హాల్ సబ్ వే స్టేషన్ లో గురువారం అర్ధరాత్రి న్యూయార్క్ మేయర్ గా మద్దనీ బాధ్యతలు స్వీకరించారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన మమ్లానీ
న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో ఖురాన్ పై చేయి వేసి ప్రమాణం చేశారు. న్యూయార్క్ నగర 112వ మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే మేయర్ పదవిని చేపట్టిన మమ్లానీ, అరుదైన ఘనతలు సాధించారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి మొదటి ముస్లిం నేతగా చరిత్ర సృష్టించారు. తొలి దక్షిణాసియా (సౌత్ ఏషియన్) మేయర్ గా నిలిచారు.
Read also: AP: మార్చిలోగా కోటి మందికి స్వమిత్వ యాజమాన్య హక్కు పత్రాలు

Jahan Mazdani
పిన్నవయసులోనే మేయర్ బాధ్యతలుJahan Mazdani
గత శతాబ్దానికి పైగా కాలంలో అత్యంత పిన్నవయసులో మేయర్ గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా రికార్డు సృస్టించారు. పదవి దక్కించుకున్న తొలి భారత-అమెరికన్ ముస్లింగా నిలిచారు. ప్రజల జీవన వ్యయభారం తగ్గించడమే ప్రధాన అజెండగా రాజకీయ రంగంలోకి వచ్చిన మజ్దానీ తన ఎన్నికల ప్రచారంలో కీలక హామీలు ఇచ్చారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: