అమెరికా ప్రభుత్వం H-1B వీసా నిబంధనలను కఠినతరం చేయడం అనూహ్యంగా భారత ఐటీ రంగానికి అనుకూలంగా మారుతోంది. అధిక వీసా ఫీజులు, భారీ వేతన వ్యయాల కారణంగా అనేక అంతర్జాతీయ టెక్ కంపెనీలు(IT Sector) భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి. దీని ఫలితంగా దేశంలో ఉద్యోగాల సృష్టికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి.

Read Also: China: తైవాన్‌కు ఆయుధాల అమ్మకం పై అమెరికాకు చైనా హెచ్చరిక
ఈ ఏడాది మాత్రమే పలు ప్రముఖ సంస్థలు భారత్‌లో కీలక టెక్నాలజీ, డిజిటల్ రంగాల్లో సుమారు 32 వేల మందికి(IT Sector) ఉద్యోగాలు కల్పించాయి. వీసా సంబంధిత అనిశ్చితులు లేకపోవడం, తక్కువ ఖర్చుతో నైపుణ్యం గల మానవ వనరులు అందుబాటులో ఉండటం కంపెనీలకు పెద్ద ప్రయోజనంగా మారింది.
అమెరికాలో విధించిన ఆంక్షలు అక్కడ ఉద్యోగ అవకాశాలను తగ్గిస్తుండగా, అదే సమయంలో భారత ఐటీ పరిశ్రమకు ఊపిరి పోస్తున్నాయి. దేశీయంగా ఉపాధి పెరుగుదలతో పాటు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: