ఇరాన్, ఇజ్రాయెల్ (Iran, Israel) మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రెండు దేశాలు ఒకదానికొకటి క్షిపణులతో ముష్కర దాడులు చేస్తుండటంతో పరిస్ధితి నియంత్రణకు రావడం లేదు. ఈ తాజా ఘర్షణలు మూడవ ప్రపంచ యుద్ధ భయాన్ని కలిగిస్తున్నాయి.ఇరాన్ మిలటరీ వర్గాల కథనం ప్రకారం, ఈసారి లక్ష్యం ఎవరూ ఊహించని చోటు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ (Intelligence agency Mossad) ప్రధాన కార్యాలయంపై ఇరాన్ అర్థరాత్రి క్షిపణి దాడి జరిపింది. ఈ దాడిలో తీవ్ర నష్టం జరిగిందని అక్కడి మీడియా వెల్లడించింది. ఇదే కాక, గ్లిలాట్‌లోని మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ కూడా టార్గెట్‌లో పడినట్టు సమాచారం.
మొసాద్ చేతకానిదేనా?
ఇరాన్ ఆరోపణల ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల వెనక మొసాద్ పాత్ర కీలకంగా మారింది. దేశీయ అణు శాస్త్రవేత్తల సమాచారం, భద్రతా అధికారుల స్థావరాల వివరాలు మొసాద్‌కు చేరుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. డ్రోన్ల ద్వారా భూగోళ సమాచారాన్ని సేకరించి, అణు కేంద్రాలపై దాడులు జరుపుతున్నట్టు చెబుతున్నారు.
చర్చలు? కానీ దాడులు ఆగడం లేదు
ఒకవైపు చర్చల కోసం సిద్ధమని ఇరాన్ చెప్పినా, మరోవైపు దాడులు మాత్రం మళ్లీ ముమ్మరంగా కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలకు మధ్యవర్తుల ద్వారా సందేశాలు పంపినట్టు తెలుస్తోంది. అయితే ఈ మాటలు యుద్ధంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు.ఇరు దేశాల ఘర్షణ భయంకరమైన దశలోకి వెళ్తోంది. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ స్థాయిలో కలకలం సృష్టిస్తున్నాయి. యుద్ధ భూతాన్ని తలపించేలా ఈ సంఘటనలు కొనసాగుతుండటంతో, జీవితనష్టం, ప్రపంచ స్థిరతపై ప్రమాదసూచక సంకేతాలే వినిపిస్తున్నాయి.
Read Also : New Baba Vanga : ఆందోళన కలిగిస్తున్న కొత్త బాబా వంగ జోస్యం..