తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం రేవంత్, ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit)’ నేపథ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ ప్రముఖులు, పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా.. హైదరాబాద్‌లోని కీలకమైన రహదారులకు ప్రఖ్యాత వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: TG: నేటి నుంచే గ్లోబల్ సమిట్..
ప్రెసిడెంట్ ట్రంప్ ఎవెన్యూ
అమెరికాకు చెందిన ప్రముఖులను గౌరవించే విధంగా.. యూఎస్ కాన్సులేట్ వెళ్లే రహదారికి ‘ప్రెసిడెంట్ ట్రంప్ ఎవెన్యూ’ (Donald Trump) గా నామకరణం చేయనున్నారు. నగరంలో సాంకేతిక రంగానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పేలా మరికొన్ని కీలక ప్రాంతాలకు ప్రముఖ టెక్నాలజీ సంస్థల పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

ఇందులో గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ , విప్రో జంక్షన్ల పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఈ పేర్లకు సంబంధించి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు , అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలో లేఖ రాయనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: