हिन्दी | Epaper
25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ

Iran Ship Attack: ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

Saritha
Iran Ship Attack: ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

Iran Ship Attack: ఇజ్రాయెల్-అమెరికాలతో యుద్ధం కొనసాగుతున్న వేళ శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక పై దాడి చోటుచేసుకుంది. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డెనాపై జరిగిన ఈ దాడిలో 100 మందికిపైగా గల్లంతు కాగా. మరో 72 మంది గాయపడ్డారు. ఈ దాడి గురించి శ్రీలంక నేవీ అధికారి వెల్లడించారు. బుధవారం తమ ప్రాదేశిక జలాల్లో దక్షిణంగా 25 మైళ్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోయినట్టు లంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్ ధ్రువీకరించారు. నౌక మునిగిపోవడానికి గల కారణంపై వెంటనే ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు, కానీ గాయపడిన నావికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు హెరాత్ పార్లమెంటుకు వెల్లడించారు.

Read Also: UAE: యూఏఈలకు ఫ్రాన్స్ అండగా రఫేల్ ఫైటర్ జెట్ల సాయం..

Iran Ship Attack: ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి
Iran Ship Attack: Submarine attack on Iranian ship

101 మంది ఆచూకీ లభ్యం కాలేదు

గల్లంతైన నావికుల కోసం గాలింపు కొనసాగుతున్నట్టు శ్రీలంక రక్షణ శాఖ తెలిపింది. మిగతావారు ఏమయ్యారో తెలియరాదని పేర్కొంది. శ్రీలంక యుద్ధ నౌకలు, విమానాలను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయని, నౌక మునిగిపోవడానికి కారణం ఏంటో తెలియరాలేదని చెప్పారు. ఈ యుద్ధ నౌక విశాఖలో జరిగిన ఐఎఫ్ఆర్, అంతర్జాతీయ పరిక్రమ్‌లో పాల్గొని, ఫిబ్రవరి 17న ఇరాన్‌కు బయలుదేరిందని రాయిటర్స్ పేర్కొంది. శ్రీలంకలోని గాలే మీదుగా వెళ్తుండగా దాడి జరిగినట్టు తెలిపింది.

ఇరాన్‌పై జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగానే ఈ నౌకపై బాంబు దాడి జరిగిందా? అని ప్రతిపక్ష సభ్యుడు ప్రశ్నించినా.. ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన రాలేదు. శ్రీలంక ప్రాదేశిక జలాలకు అనుగుణంగా తమ ఆపరేషన్ జరిగిందని, రాజధాని కొలంబోకు 115 కిలోమీటర్లు (70 మైళ్లు) దక్షిణంగా ఉన్న గాలెలోని ప్రధాన ఆసుపత్రికి 32 మంది ఇరానియన్ నావికులను తరలించామని నేవీ ప్రతినిధి బుద్ధిక సంపత్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870