हिन्दी | Epaper

Iran: జాడలేని ఖమేనీ..పారిపోయార వార్త నిజమేనా?

Tejaswini Y
Iran: జాడలేని ఖమేనీ..పారిపోయార వార్త నిజమేనా?

ఇరాన్(Iran) లో గత కొన్నిరోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని(Ayatollah Khamenei)కీ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారింది. పలువురు మరణించడంతో పాటు అనేకులు గాయపడ్డారు. దీంతో ఇరాన్ లో నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత రెండు వారాలుగా ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఆందోళనలను చక్కదిద్దడంలో భద్రతాదళాలు వైఫల్యం చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ (86) 20మంది సహయకులు, కుటుంబ సభ్యులతో మాస్కోకు పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read also: Nicolas Maduro : అమెరికా కోర్టులో మదురో: ‘నేను నిర్దోషిని’ | వెనెజువెలా సంక్షోభం

ఈ మేరకు నిఘా వర్గాలు పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లర్లు తీవ్రరూపం దాల్చడంతో మరింత హింసాత్మకం(Violent)గా మారకుండా ఉండేందుకు అయతుల్లా ఖమేనీ టెహ్రాన్ నుంచి రష్యాకు పారిపోవడానికి అవసరమైన ప్రణాళిక రచించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. ఇప్పటికే భద్రతా దళాల కాల్పుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాల పాలయ్యారు. పరిస్థితులు చేదాటిపోతున్నాయన్న భావనతో ఖమేనీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Khamenei
Iran: Khamenei is missing..is the news that he has fled true?

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని సైన్యం

అయితే నిరసనకారులను అడ్డుకోవడంలో సైన్యం, భద్రతాదళాలు ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగా ఖాతర్ చేయట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ రష్యాకు వెళ్లిపోయాక ‘ప్లాన్ బీ’ ప్రకారం కుమారుడు మోజాబాను వారసుడిగా రంగంలోకి దింపాలని ప్రణాళిక వేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు నిరసనకారులపై జులం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ఇరాన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులు చనిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన విషయం విధితమే. నిరసనలు హింసాత్మకంగా మారితే అమెరికా రంగంలోకి దిగాల్సి ఉంటుందని ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు.

ఖండించిన ఇరాన్

ఇదిలా ఉంటే అయతుల్లా ఖమేనీ రష్యాకు పారిపోతున్నట్లు వస్తున్న వార్తలను భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. అది పూర్తిగా అవాస్తవం అని కొట్టి పారేసింది. ఇశ్రాయెల్ తో ఇరాన్ 12 రోజుల పాటు యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికీ పారిపోలేదని.. ఇప్పుడెందుకు పారిపోతారని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ హమాస్ లమధ్య యుద్ధం జరిగిన సమయంలో ఇశ్రాయెల్ అమెరికా సాయంతో హఠాత్తుగా ఇరాన్ పై 12రోజుల పాటు యుద్ధం చేసింది. ఖమేనీని హతమార్చడమే ధ్యేయంగా అప్పట్లో ఈ యుద్ధం జరిగింది. అయినా ఖమేనీ ఇరాన్ లోని బంకర్లలలో తలదాచుకున్నారని వార్తలు వచ్చాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు
0:03

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్‌

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్‌

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి క్రేజీ అప్‌డేట్

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి క్రేజీ అప్‌డేట్

📢 For Advertisement Booking: 98481 12870