పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని అమెరికాపై నిప్పులు చెరిగారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఖమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also:Iran Israel War: యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్న అలీ లారిజాని
అమెరికా జరిపిన ఈ దాడుల్లో అనేకమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని లారిజాని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అమెరికా చర్యలు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, శాంతిని కాపాడాల్సిన దేశమే హింసకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. దాడుల వల్ల జరిగిన నష్టాన్ని ప్రపంచం గమనిస్తోందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా లారిజాని ఘాటుగా స్పందించారు. ఇరాన్ యుద్ధాన్ని కావాలనే కొనసాగిస్తోందని ట్రంప్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అది కేవలం అసత్య ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ఇటువంటి వ్యూహాలను అనుసరిస్తోందని ఆరోపించారు. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలను మరింత దట్టం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: