Iran Israel War: ఇజ్రాయెల్-అమెరికాలతో సాగిస్తున్న పోరాటంలో ఇరాన్ తన వ్యూహాత్మక దాడులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆత్మాహుతి డ్రోన్లు, శక్తివంతమైన క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా గల్ఫ్ ప్రాంతంలో క్షిపణి భద్రతను పర్యవేక్షించే అత్యంత కీలకమైన రాడార్ వ్యవస్థను ఇరాన్ ధ్వంసం చేసినట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు అధికారికంగా ధ్రువీకరించారు.
Read Also: Pushpak Tanker: భారత్‌కు వస్తున్న ‘పుష్పక్’ ట్యాంకర్‌తో ఇంధన సరఫరాకు ఊరట
ఇరాన్ చేసిన అత్యంత విజయవంతమైన దాడులలో ఒకటిగా నిలుస్తుంది
యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్ వద్ద అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు (US THAAD) ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్, సహాయక సామాగ్రి ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫోటోలను ఉటంకిస్తూ , సీఎన్ఎన్ నివేదించింది. ఈ వ్యవస్థ ధ్వంసమైనట్టు తాజాగా అమెరికా అధికారి ధ్రువీకరించారు.ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ థింక్ ట్యాంక్ సేకరించిన డేటా ప్రకారం.. జోర్డాన్‌పై ఫిబ్రవరి 28న, మార్చి 3న ఇరాన్ చేసిన రెండు దాడులను అమెరికా అడ్డుకుంది.

‘థాడ్ రాడార్ వ్యవస్థపై దాడి విజయవంతమైతే ఇప్పటివరకు ఇరాన్ చేసిన అత్యంత విజయవంతమైన దాడులలో ఒకటిగా నిలుస్తుంది’ అని, ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ సెంటర్ ఆన్ మిలిటరీ అండ్ పొలిటికల్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ ర్యాన్ బ్రోబ్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘అమెరికా సైన్యం, దాని మిత్రపక్షాల వద్ద అధునాతన రాడార్లు ఉన్నాయని, అవి గగనతల, క్షిపణి రక్షణను అందించి, ఏ ఒక్క రాడార్ నష్టాన్ని అయినా తగ్గించగలవు’ అని ఆయన తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: