Iran Israel War: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు ‘ప్రత్యేక అనుమతి’ మంజూరు చేసింది. ఇప్పటికే సముద్ర మార్గంలో ట్యాంకర్లలో సిద్ధంగా ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అంగీకరించింది.
Read Also: S. Jaishankar: ఇరాన్ నౌక ఘటనపై జైశంకర్ స్పందన
స్కాట్ బెసెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు
యుఎస్ ట్రెజరీ సెక్రటరీ, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు స్కాట్ బెసెంట్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. “భారతీయులు చాలా మంచివాళ్లు. రష్యా ఆయిల్ కొనవద్దు అని మేము చెప్పినప్పుడు వారు గౌరవించి ఆపేశారు. ఆ లోటును అమెరికా ఆయిల్‌తో భర్తీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన చమురు సరఫరా గ్యాప్‌ను పూరించడానికి, రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేసేందుకు భారత్‌కు వెసులుబాటు కల్పించాం” అని ఆయన పేర్కొన్నారు.

అమెరికా ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సౌత్ ఏషియా సముద్ర జలాల్లో ఉన్న రష్యా ఆయిల్‌ను భారత్ త్వరగా రిఫైన్ చేసి మార్కెట్‌లోకి తెస్తే, ప్రపంచంలోని ఇతర రిఫైనరీల మీద ఒత్తిడి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది రష్యాపై అమెరికా విధానంలో శాశ్వత మార్పు కాదని, కేవలం యుద్ధం వల్ల ఏర్పడిన తాత్కాలిక అవసరాల కోసమేనని అధికారులు స్పష్టం చేశారు. గత నెలలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ రష్యా ఆయిల్ ఆపేసి అమెరికా ఆయిల్ కొనడానికి అంగీకరించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ స్వల్పకాలిక మినహాయింపు ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: