
ఇరాన్‌లో ఆర్థిక(Iran Crisis) సంక్షోభం నేపథ్యంలో చెలరేగిన ప్రజా నిరసనలు తీవ్ర హింసాత్మక రూపం దాల్చాయి. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పడం, దేశ కరెన్సీ విలువ వేగంగా పడిపోవడం వల్ల సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనలు క్రమంగా ఘర్షణలకు దారి తీసి భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం.
Read Also: America :చెట్టును ఢీకొట్టి మంటల్లో దగ్ధమైన కారు

టెహ్రాన్‌లోనే 217 మందికిపైగా మృతి – వైద్యుడి వెల్లడి
టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వైద్యుడు సంచలన విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు కనీసం 217 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. ఈ మరణాలన్నీ ప్రధానంగా రాజధాని టెహ్రాన్ నగరంలోనే చోటుచుకున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితిని గమనిస్తే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ధరల నియంత్రణ, ఉద్యోగ అవకాశాలు,(Iran Crisis) జీవన భద్రత వంటి అంశాల్లో సరైన చర్యలు లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆందోళనలు అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దించింది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ పరిమితులు విధించినట్లు, రవాణా వ్యవస్థను నియంత్రించినట్లు సమాచారం. అయినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోందని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: