Iran Attack: ఇరాక్ సమీపంలో అమెరికాకు చెందిన ముడి చమురు ట్యాంకర్‌పై ఇరాన్ జరిపిన దాడిలో భారతీయ సిబ్బంది ఒకరు మరణించారు. ఈ ఘటనలో మరో 15 మంది భారతీయులను సురక్షితంగా కాపాడినట్లు బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న “సేఫ్‌సీ విష్ణు” అనే ఈ నౌకపై బుధవారం దాడి జరిగింది.
Read Also: WHO: పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

అండర్‌వాటర్ డ్రోన్లతో దాడి
ఈ ఘటనపై బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. “నిన్న జరిగిన ఈ దాడిలో భారతీయ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. మిగిలిన 15 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించాం” అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది. రక్షించబడిన భారతీయ నావికులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొంది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాక్ ప్రాదేశిక జలాల్లో రెండు ఆయిల్ ట్యాంకర్లను అండర్‌వాటర్ డ్రోన్లతో పేల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో యూఎస్ యాజమాన్యంలోని సేఫ్‌సీ విష్ణుతో పాటు గ్రీస్‌కు చెందిన మాల్టా జెండాతో ఉన్న “జెఫిరోస్” అనే మరో ట్యాంకర్ కూడా లక్ష్యంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: