భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందం అంశం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గతేడాది కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్ (pakistan) తాజాగా స్పందించింది. పాకిస్థాన్ సింధు జలాల కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా ఆదివారం ఓ వార్త ఛానెలతో మాట్లాడుతూ..సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడానికి భారత్ కు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ ఒప్పందం అమల్లో ఉందని.. ఏఒక్క దేశం దీనిని ఏకపక్షంగా ముగించలేదని ఆయన వాదించారు. ఆయన తన ప్రకటనలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒప్పంద చట్టాల్లో ‘సస్పెన్షన్’ (నిలిపివేత) అనే పదానికి గుర్తింపు లేదని, ఇది భారత్ సృష్టించుకున్న పదం అని ఆయన విమర్శించారు. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఏకపక్ష చర్యలను అడ్డుకునేలా ఈ ఒప్పందాన్ని రూపొందించారని, భారత్ దీనిని రద్దు చేయలేదని పాక్ విశ్వసిస్తోందని తెలిపారు.
Read also: NRI woman murdered USA : అమెరికాలో NRI యువతి హత్య, కుటుంబంలో విషాదం

If the Indus waters are not given, it will lead to war
భారత్ ను హెచ్చరించిన పాక్
పాకిస్థాన్ కు అందాల్సిన నీటి వాటాను నిలిపివేయడం లేదా తగ్గించడం వంటి చర్యలను ‘యుద్ధ చర్య’గా పరిగణిస్తామని మెహర్ అలీ షా హెచ్చరించారు. పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదుల నుంచి సహజసిద్ధంగా వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. పహల్గాం దాడితోనే భారత్ పాక్ ఇస్తున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ అంశంపై పాక్ ఇప్పటికే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి తీసుకెళ్లింది. అయితే భారత్ మాత్రం సింధు జలాల నిలిపివేతపై రాజీ పడబోమని స్పష్టం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య జలవివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. పహల్గామ్ దాడిలో తమ దేశ ప్రమేయం లేదని పాక్ ఇప్పటికీ చెబుతూనే ఉంది. కానీ భారత్ అన్ని ఆధారాలను చూపించగానే తోకముడుచుకుని ఉంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: