
గతసంవత్సరం నవంబర్ లో ఇండోనేషియాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పలువురు మరణించడంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఆ నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే కొత్త ఏడాదిలో ఆకస్మిక వరదలు ఇండోనేషియాను మరోసారి అతలాకుతలం చేసింది. గతేడాది నవంబర్ లో వచ్చిన వరదలతో అతలాకుతలం అయింది. అప్పట్లో 1,000 మందివరకు చనిపోయారు. (Indonesia) తాజాగా సోమవారం కూడా మరోసారి ఉత్తర సులవేసిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల 14మంది మరణించగా.. నలుగురు గల్లంతయ్యారు.
Read also: Iran: జాడలేని ఖమేనీ..పారిపోయార వార్త నిజమేనా?

వందలాదిమంది నిరాశ్రయులయ్యారు.
గల్లంతు అయినవారికోసం కొనసాగుతున్న అన్వేషణ సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు (Rains) సియావు టాగులాండాంగ్ బియాలో ప్రాంతంలో ఉన్న సియావు ద్వీపంలో ఆకస్మిక వరదలు సంభవించాయని స్థానిక రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి సురియాడిన్ గుమెలెంగ్ తెలిపారు. ఇప్పటివరకు 14మంది మరణించారని గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. మరో 18 మంది గాయపడినట్లు చెప్పారు. (Indonesia) వరద ప్రభావిత ప్రాంతాల్లో రాళ్లు పేరుకుపోయాయనని.. బుదతో కప్పబడిందని వెల్లడించారు. జావా, సులవేసి, మలుకు, పాపువా దీవుల్లో ఈ సంవత్సరం జనవరి-ఫిబ్రవరి నెలల్లో గరిష్ట వర్షాకాలం ఉంటుందని, దీనివల్ల వరదలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వాతావరణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 7 వాచ్చరిస్తున్నారు అధికారులు. మరోరెండు మాసాలు ఇండోనేషియాకు వర్షాలతోపాటు వరదలు తప్పేలా లేవని నిపుణులు అంటున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: