ఇండోనేషియాలోని సుమత్రా ఉత్తర ప్రాంతంలో భారీ వరదలు, కొండచరియలు విరిగి పడడం వల్ల 23 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. డజన్ల కొద్దీ ప్రజల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైక్లోన్ (Cyclone) ‘సెన్యార్’ వల్ల కురిసిన భారీ వర్షాల వల్లే గతవారం రోజులుగా నార్త్ సుమత్రా ప్రావిన్స్ లోని 11 నగరాలు, జిల్లాల్లో నదులన్నీ పొంగిపొర్లాయి. బురద, రాళ్లు, చెట్లతో కొండ ప్రాంతంలోని గ్రామాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
Read Also: America: వెడ్డింగ్ రింగ్ తో ఉషా వాన్స్.. విడాకుల రూమర్స్ కు చెక్

భారీ భూకంపం
ఇండోనేషియాలోని (Indonesia) సుమత్రా దీవిని భారీ భూకంపం (Earthquake) వణికించింది. ఇప్పటికే భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులతో పోరాడుతున్న ఆగ్నేయాసియా దేశానికి ఇది రెండవ పెద్ద విపత్తుగా మారింది. గురువారం ఉదయం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇండోనేషియా వాతావరణ, భూభౌగోళిక ఏజెన్సీ ప్రకటించింది. అయితే సునామీ వచ్చే అవకాశం లేదని తేలల్చి చెప్పారు. అయిత ఈ విపత్తువల్ల ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు రాలేదని అధికారులు చెప్పారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: