గత నాలుగు(Indigo) రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల లోపాలు, ఆలస్యాలు, రద్దులు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇతర విమానయాన సంస్థల సేవల్లో ఎటువంటి అంతరాయం లేకపోవడంతో ఈ సమస్య ప్రత్యేకంగా ఇండిగోపైే ప్రభావం చూపుతోంది.
Read also: గిరిజన సంస్కృతికి ప్రతిబింబం ఉద్భవ్

FDTL నిబంధనలు, పరిష్కార చర్యలు
డీజీసీఏ(Indigo) నవంబర్ 1 నుంచి FDTL నిబంధనలను అమలు చేసింది. ఇందులో పైలట్ల వారాంతపు విశ్రాంతిని 36 గంటల నుండి 48 గంటలకు పెంచడం, రాత్రి సమయాల్లో ల్యాండింగ్స్‌ను పరిమితం చేయడం వంటి మార్పులు ఉన్నాయి. మిగతా విమానయాన సంస్థలు కొత్త నియమాల ప్రకారం తమ కార్యకలాపాలను సర్దుకున్నప్పటికీ, ఇండిగో నిర్లక్ష్యం కారణంగా సమస్యలు ఏర్పడ్డాయి. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) ప్రకటించినట్లుగా, అన్ని సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి, అన్ని మెట్రో ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికుల సమస్యలు తొలగించబడ్డాయి. రేపటి నుంచి ఇండిగో పరిమిత సామర్థ్యంతో సక్రమంగా విమానాల సేవలు కొనసాగిస్తాయని, పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ గత వారం ఎయిర్‌బస్ A320 లకు నవీకరణలను తప్పనిసరి చేసిందని.. 323 విమానాలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా తక్కువ సమయంలోనే అది పూర్తయిందని మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఇండిగో తప్పిదాలపై విచారించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. తమ తప్పు ఉంటే అన్ని విమానయాన సంస్థలూ ఇబ్బందులు ఎదుర్కోవాలి కానీ ఒక్క ఇండిగోకే సమస్యలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయినా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: