हिन्दी | Epaper

Indians: 1,100 మంది భారతీయులను బహిష్క‌రించిన అమెరికా..మంత్రిత్వ శాఖ వెల్లడి

Sharanya
Indians: 1,100 మంది భారతీయులను బహిష్క‌రించిన అమెరికా..మంత్రిత్వ శాఖ వెల్లడి

2025 జనవరి నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,100 మంది భారతీయులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) మీడియాతో వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తిరిగి పదవిలోకి వచ్చిన అనంతరం వలస సంబంధిత నియమ నిబంధనల అమలులో కఠినత్వం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో భారతీయులపై ప్రభావం పడినట్లు సమాచారం.

వాణిజ్య విమానాల ద్వారా పంపింపు:

ఈ బహిష్కరణలలో సుమారు 62 శాతం మంది వాణిజ్య విమానాల ద్వారా భారత్‌కు తిరిగి చేరారు. అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతుందని, అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని మన దేశం వెనక్కి ర‌ప్పిస్తుంద‌ని ఆయన వివరించారు.

అక్రమ వలసలపై అమెరికా-భారత్ మధ్య సహకారం:

అక్రమ వలసలపై రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని రణధీర్ జైశ్వాల్ హైలైట్ చేశారు. వలస సమస్యపై భారత్‌, అమెరికా మధ్య మంచి సన్నిహిత సహకారం ఉంది. అక్కడ అక్రమ హోదా కలిగి ఉన్న, చట్టవిరుద్ధంగా అక్కడికి ప్రయాణించిన భారతీయ పౌరులను బహిష్కరించే విషయంలో వారి గురించి పూర్తి వివరాలు అందిన తర్వాత అన్ని విష‌యాలు ధ్రువీక‌రించుకున్నాక‌ మేము వారిని తిరిగి స్వ‌దేశానికి ర‌ప్పిస్తున్నాం. మేము ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగా వారి జాతీయతలను మేము ధృవీకరిస్తాం. ఆ తర్వాత మాత్రమే వారిని తిరిగి ఇండియాకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం అని ఆయన అన్నారు.

ఇరాన్‌లో ముగ్గురు భారతీయుల గురించి తెలియకపోవడం:

ఈ సందర్భంగా రణధీర్ జైశ్వాల్ మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఇరాన్‌లో ముగ్గురు భారతీయ పౌరులు తప్పిపోయిన ఘటనపై, భారత ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తోంది. ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. ఇరాన్ వైపు నుంచి కూడా మంచి సహకారం లభిస్తోందని విలేకరుల సమావేశంలో తెలిపారు. తప్పిపోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబ సభ్యులకు మంత్రిత్వ శాఖ అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వలస సమస్యలు, అక్రమ వలసల నియంత్రణ అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారాయి. ముఖ్యంగా అమెరికాలో వలసదారుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, అక్కడి ప్రభుత్వం నియమాలను కఠినతరం చేయడమే కాకుండా, విదేశీ పౌరులను తిరిగి పంపించడంపై దృష్టి పెడుతోంది.

Read also: India: ఆర్థికంగా చైనా కన్నా భారత్ ఎక్కువగా బలపడాలి అంటే..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870