H-1B visa : భారత సంతతి వ్యక్తి కిశోర్‌కు అమెరికాలో హెచ్-1బీ వీసా మోసం కేసులో 14 నెలల జైలు శిక్ష పడింది. నానోసెమాంటిక్స్ సంస్థకు సహవ్యవస్థాపకుడిగా ఉన్న కిశోర్‌పై అక్రమ మార్గాల్లో వీసాలు పొందేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు రాగా.. అవి నిజమని దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించి గత ఏడాదిలోనే నిందితుడు నేరం అంగీకరించగా ఇటీవల శిక్ష ఖరారైంది. దీంతోపాటు నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 1.25 లక్షల డాలర్లు, ఇతర కారణాల కింద 7500 డాలర్ల జరిమానా, ప్రత్యేక రుసుము కింద మరో 1100 డాలర్లు వసూలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

మరో ఇద్దరిపై వీసా మోసం, కుట్ర కేసులు
కాలిఫోర్నియాకు చెందిన కిశోర్.. బే ఏరియా టెక్ కంపెనీల కోసం నానోసెమాంటిక్స్ సంస్థ ద్వారా నైపుణ్యం కలిగిన ఉద్యోగులను సరఫరా చేసి కమీషన్ పొందుతుండేవాడు. ఈ క్రమంలో 2019లో అక్కడ ఉద్యోగాలు అందుబాటులో లేకముందే వీసాలు పొందే చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా హెచ్-1బీ వీసాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తించిన పోలీసులు.. కిశోర్‌తోపాటు మరో ఇద్దరిపై వీసా మోసం, కుట్ర కేసులు నమోదు చేశారు.
Read Also: లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతం!