US action against Venezuela : వెనిజులా అధ్యక్షుడు Nicolas Maduro ను అమెరికా అరెస్ట్ చేసి దేశం వెలుపలికి తీసుకెళ్లిన ఘటనపై భారత్‌లోని పలువురు రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి నియమావళిని ఉల్లంఘించడమేనని వారు అభిప్రాయపడ్డారు.
సీనియర్ కాంగ్రెస్ నేత Shashi Tharoor మాట్లాడుతూ, అంతర్జాతీయ చట్టాలు, యూఎన్ చార్టర్‌ను చాలా కాలంగా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచంలో “న్యాయపాలన” కాదు, “అడవి చట్టం” (Law of the Jungle) అమలవుతోందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం మరో దేశంలోకి వెళ్లి నాయకుడిని పట్టుకెళ్లడం ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.
Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?
అదేవిధంగా శివసేన నేత Shaina NC కూడా అమెరికా చర్యలను (US action against Venezuela) తీవ్రంగా ఖండించారు. “ఏ దేశమైనా ప్రపంచాన్ని బెదిరిస్తూ తిరగలదు. అంతర్జాతీయ వ్యవస్థలో ప్రతి దేశం సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి” అని ఆమె స్పష్టం చేశారు. అమెరికా చేసిన ఈ చర్య ప్రపంచానికి తప్పు సంకేతాలు పంపుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలు Donald Trump నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వెనిజులాపై తీసుకున్న కఠిన చర్యల నేపథ్యంలో వచ్చాయి. నార్కో–టెర్రరిజం ఆరోపణలతో మడురోను అరెస్ట్ చేయడాన్ని అమెరికా సమర్థించుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఈ చర్యపై వివాదం చెలరేగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: