Indian attacked in Thailand : థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పట్టాయ నగరంలోని రద్దీ వీధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, గత నెల 27న ఈ సంఘటన చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కొందరు ట్రాన్స్‌జెండర్ సెక్స్ వర్కర్లు ఓ భారతీయుడిపై మూకుమ్మడిగా దాడి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితుడిని రక్షించారు.
Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
దాడికి గురైన వ్యక్తిని రాజ్ జసూజా (52)గా గుర్తించారు. ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో మొదట ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం పట్టామకూన్ ఆసుపత్రికి తరలించారు. ట్రాన్స్‌జెండర్లు ఆయనను వెంబడిస్తూ, కాలితో తన్నుతూ, రోడ్డుపై ఇష్టారీతిన దాడి చేసిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ ఘటనకు ముందు బాధితుడు, ఓ ట్రాన్స్‌జెండర్ (Indian attacked in Thailand) మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం ఆ ట్రాన్స్‌జెండర్ తన స్నేహితులను ఫోన్ చేసి పిలవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారి దాడికి దారితీసిందని సమాచారం. అయితే అసలు గొడవకు కారణం ఏమిటన్న విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: