हिन्दी | Epaper

Indian Army: ఉగ్రవాద కీలక స్థావరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ

Sharanya
Indian Army: ఉగ్రవాద కీలక స్థావరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ

భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో “ఆపరేషన్ సింధూర్” సైనిక స్థాయిలో ఒక కీలక ఘట్టంగా మారింది. మొదటి దశలో పాకిస్థాన్‌తో పాటు పీఓకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్) లోని అనేక ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో వంద మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. ఇది ఉగ్రవాద ముప్పును ముందుగానే అణచివేసేందుకు భారత రక్షణ వ్యవస్థ తీసుకున్న ఘట్టమైన చర్యగా విశ్లేషించబడుతోంది.

డ్రోన్ల ద్వారా పాక్ దాడులు:

భారత్ సైన్యం వారి కుట్రలను సమర్ధంగా తిప్పి కొడుతోంది. ఈ సమయంలోనే జమ్ములో పాకిస్తాన్ డ్రోన్ల ను భారత్ పై ప్రయోగానికి స్థావరంగా వినియోగించు కుంటున్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. భారత్- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కాల్పులే కాకుం డా డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీనిపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. మరోవైపు శ్రీనగర్, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాక్​దాడులకు ప్రతీగా ఆ దేశానికి చెందిన మూడు వైమానిక స్థావరాలపై భారత్​ విరుచుకుపడనట్లు సమచారాం.

అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సహా ఐదుగురు మృతి

పాక్​జరిపిన దాడు ల్లో జమ్ముకశ్మీర్​కు అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ రాజ్‌కుమార్‌ థప్పా మృతి చెందారు. రాజౌరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్‌ ఫిరంగులు పడటం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌కుమార్‌ జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనలో రాజ్​కుమార్ సహా ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. అటు శ్రీనగర్ లో ఉదయం నుంచి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

లాంచ్ ప్యాడ్ల ధ్వంసం

జమ్ము ప్రాంతంలో డ్రోన్లతో దాడి చేసేందుకు స్థావరంగా వినియోగించుకుంటున్న లాంచ్ ప్యాడ్ లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. వీటి వీడియోలను విడుదల చేసింది. కాగా, పాకిస్థాన్‌లోని 4 ఎయిర్‌బేస్‌లపై మనం డ్రోన్‌ దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన ఏడీ రాడార్‌ను డ్రోన్లు ధ్వంసం చేశాయని భారత సైన్యం ప్రతినిధి ఖురేషీ వెల్లడించారు. పాకిస్థాన్ సైనిక బలగాలు ముందుకు వస్తున్నట్లు గమనించినట్లు చెప్పారు. పాకిస్థాన్‌ తన అసత్య ప్రచారాలను కొనసాగిస్తోందని మండిపడ్డారు. భారత్‌లోని పలు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు పాక్‌ చేస్తు న్న ప్రచారం అవాస్తవం ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. పాక్‌ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో భారత సైన్యాధికారులు తిప్పి కొట్టారు. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌ లాంచర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.

Read also: Jawan Sachin Yadav : సరిహద్దులో మరో వీరమరణం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం ముగియాలంటే ఆ ‘మూడు’ షరతులకు తలొగ్గాల్సిందే.. ఇరాన్ సంచలన డిమాండ్లు!

యుద్ధం ముగియాలంటే ఆ ‘మూడు’ షరతులకు తలొగ్గాల్సిందే.. ఇరాన్ సంచలన డిమాండ్లు!

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

ఇరాన్ చేసిన దాడిలో భారతీయుడు మృతి
0:15

ఇరాన్ చేసిన దాడిలో భారతీయుడు మృతి

స్ట్రైకర్‌పై ఇరాన్ సైబర్ దాడి.. 50 TB డేటా అవుట్!

స్ట్రైకర్‌పై ఇరాన్ సైబర్ దాడి.. 50 TB డేటా అవుట్!

అమెరికా ట్రంప్ ప్రభుత్వం సెక్షన్ 301 కింద భారీ వాణిజ్య దర్యాప్తు ప్రారంభించింది

అమెరికా ట్రంప్ ప్రభుత్వం సెక్షన్ 301 కింద భారీ వాణిజ్య దర్యాప్తు ప్రారంభించింది

వ్యూహాత్మక నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల

వ్యూహాత్మక నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల

మిడిల్ ఈస్ట్ యుద్ధం తీవ్రతరం

మిడిల్ ఈస్ట్ యుద్ధం తీవ్రతరం

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

📢 For Advertisement Booking: 98481 12870