వాణిజ్య ఒప్పందం చర్చలకు సంబంధించి సెప్టెంబర్‌లో జరిగిన ఓ కీలక సమావేశంలో అమెరికాకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ట్రేడ్ డీల్ కోసం తొందరేమి లేదని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ తేల్చిచెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ కథనంలో పేర్కొంది. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాణిజ్య చర్చల సమయంలో భారత ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సహా పలువురు అధికారులు నోరు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval), అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు సమావేశమయ్యారు. ఆ భేటీలో భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ట్రంప్, ఆయన అధికారుల బెదిరింపులకు భారత్ తలొగ్గదని, అవసరమైతే వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్ పదవీ కాలం ముగిసేవరకు వేచిచూస్తామని రూబియోతో ఢోబాల్ చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
Read Also: Epstein email scandal : ఎప్‌స్టీన్ ఫైల్స్ షాక్, మైనర్ల వద్దకు రమ్మంటూ ఈమెయిల్!

ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు
అయితే, ఈ సమావేశం జరిగిన కొన్ని రోజులకే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు కొంతమేర తగ్గినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రధాని మోదీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ సమయంలో ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు, ఈ భేటీ గురించి అమెరికా విదేశాంగ ప్రతినిధి కూడా మాట్లాడారు. ప్రైవేటు చర్చల వివరాలు బయటకు వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, భారత్ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల భారత్- అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో అమెరికా దిగుమతి చేసుకునే భారత వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో దక్షిణాసియాలోని పొరుగు దేశాలు, కీలక ఎగుమతి పోటీదారుల కంటే భారత్ పైచేయి సాధించినట్లయింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: