India US relations : అమెరికా విడుదల చేసిన జాతీయ భద్రతా విధానం 2025 (National Security Strategy 2025) లో భారత్‌కు కీలక ప్రాధాన్యం ఇచ్చింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్, క్వాడ్ (QUAD) కూటమి అమెరికా వ్యూహంలో కేంద్ర పాత్ర పోషిస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
H-1B వీసా సమస్యలు, పరస్పర టారిఫ్‌లు, వాణిజ్య విభేదాలు ఉన్నప్పటికీ, అమెరికా ఇప్పుడు భారత్‌ను ఒక ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోందని తెలుస్తోంది. ఈ కొత్త వ్యూహ పత్రంలో భారత్‌తో వాణిజ్యం, రక్షణ సహకారం, టెక్నాలజీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించింది.
డిసెంబర్ 4న విడుదలైన ఈ పత్రం ఆసియా (India US relations) ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనాను ప్రధాన వ్యూహాత్మక సవాల్‌గా పేర్కొంటూ, దానిని ఎదుర్కొనేందుకు భారత్ కీలక పాత్ర పోషించగలదని పేర్కొంది. ఇక పాకిస్థాన్‌కు ఈ 29 పేజీల నివేదికలో ఒక్కసారి మాత్రమే ప్రస్తావన ఉండడం గమనార్హం.
Read also: Election Inducement: ఎన్నికల నియమాలు ఉల్లంఘన: డబ్బుల పంపిణీపై అభ్యర్థుల దృష్టి
“భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచాలి. ఇండో-పసిఫిక్ భద్రతలో భారత పాత్రను పెంచాలి. ఆస్ట్రేలియా, జపాన్, భారత్, అమెరికా కలిసి పనిచేసే క్వాడ్ సహకారం మరింత బలపడాలి,” అని నివేదిక పేర్కొంది.
ఇండో-పసిఫిక్‌ను ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ కేంద్రంగా అభివర్ణిస్తూ, ప్రపంచ వాణిజ్యంలో సగానికి పైగా ఈ సముద్ర మార్గాల ద్వారానే సాగుతుందని గుర్తుచేసింది. చైనా ఆధిపత్య ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు, గ్లోబల్ సరఫరా శృంఖలలకు ముప్పుగా మారవచ్చని హెచ్చరించింది.
ఈ వ్యూహం అమలులోకి రావటంతో, భవిష్యత్తులో భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: