భారత్‌తో రష్యా (Russia) మధ్య చిరస్థాయిగా నిలిచి ఉన్న మైత్రి బంధాలు మరింత బలపడుతున్నాయి. సోవియట్ యుగం నుంచి ఇద్దరు దేశాల మధ్య రక్షణ, అంతరిక్షం, శక్తి వంటి రంగాల్లో అనేక ఒప్పందాలు జరిగాయి.మరీ ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఇండియా.. మాస్కోను నమ్మకమైన మిత్రుడిగా భావిస్తోంది.
Read Also: Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి
ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించి మరో డీల్ కుదరబోతుంది. తన చిరకాల మిత్రుడు భారత్‌కు రష్యా (Russia) బంపరాఫర్ ఇచ్చింది. మాస్కో ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన Su-57ను భారత్‌కు ఇవ్వడానికి సిద్ధం అని ప్రకటించింది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఎలాంటి షరతులు లేకుండా సాంకేతికతను మార్పిడి చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ సీఈవో సెర్గీ చెమెజోవ్..
తాజాగా దుబాయ్ ఎయిర్ షోలో ప్రకటించారు. రష్యన్ Su-57 జెట్‌లను అమెరికా F-35 జెట్‌కు పోటీగా భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో 5వ తరం స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ కేవలం రష్యా , అమెరికా, చైనా వద్ద మాత్రమే ఉంది. ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక.. యూఎస్ F-35 జెట్లను భారత్‌కు అమ్మాలని ప్రయత్నిస్తున్నారు.

రష్యా నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం
ఈక్రమంలో రష్యా కంపెనీ చేసిన ప్రకటన సంచలనంగా నిలిచింది..కొన్ని రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కోలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో జైశంకర్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు.
వీరి భేటీ తర్వాత.. రష్యా నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం. ఇదిలా ఉంటే వచ్చే నెల అనగా 2025, డిసెంబర్ నెలలో పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ టూర్‌లోనే ఇరు దేశాల మధ్య Su-57 జెట్ల ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: