ఇండో పసిఫిక్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేఫథ్యంలో భారత్, ఫిలిప్పీన్స్(India-Philippines) మధ్య సంబంధాలు మెరుగుతున్నాయి. ఇరుదేశాల మధ్య రక్షణ, ఆర్థిక సహకారంలో పురోగతి కనిపిస్తోంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ సోమవారం భారత్‌కు రానున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు అయిదు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక భారత్(India)కు రావడం ఇదే మొదటిసారి. ఆయన పర్యటన భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకల మధ్య జరగడం మరో విశేషం. మార్కోస్ పర్యటన చైనాకు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్-ఫిలిప్పీన్స్ మధ్య ఎలాంటి వ్యూహాత్మక ఒప్పందాలు కుదరనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
భారత్-ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాలు
1949లో నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ఇరుదేశాలు పెట్టుబడులు, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, వాణిజ్యం. ఫార్మాస్యూటికల్స్, హెల్త్, డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. అలాగే ఆగ్నేయాసియా దేశాల కూటమి (ASEAN)తో భారత్‌కు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఫిలిప్పీన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. మహాసాగర్ విజన్, యాక్ట్ ఈస్ట్ పాలసీ, అలాగే ఇండో పసిఫిక్ వ్యూహంలో ఫిలిప్పీన్స్‌తో సంబంధాలు ఓ కీలక స్తంభంగా నిలిచినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు
అయితే మార్కస్ పర్యటనలో ముఖ్యంగా ఇరుదేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో సహకారం అందించడంపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఫిలిప్పీన్స్ తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ద–ృష్టి సారించింది. ఈ క్రమంలోనే భారత్ నుంచి ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కూడా కొనుగోలు చేసింది.
భారత టూరిస్టుల సంఖ్య ఆ దేశంలో 28 శాతం
మరోవైపు భారత్-ఫిలిప్పీన్స్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.53 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియా నుంచి ముఖ్యంగా ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఔషధాలు, ఉక్కు, బియ్యం, మాంసం లాంటివి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి అవుతున్నాయి. అలాగే ఫిలిప్పీన్స్ నుంచి సెమీకండక్టర్లు, సీసం, రాగి, ఎలక్ట్రికల్ మెషినరీ, ప్లాస్టిక్స్ వంటివి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. మరోవిషయం ఏంటటే ఇటీవల ఫిలిప్పీన్స్ భారత పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించింది .
ఫిలిప్పీన్స్ ఇండియా ఫ్రెండ్స్?
భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాలు 1949లో ఏర్పడ్డాయి. భారతదేశం మనీలాలో ఒక రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తుండగా, ఫిలిప్పీన్స్ న్యూఢిల్లీలో ఒక రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. 1952 జూలై 11న ఫిలిప్పీన్స్ మరియు భారతదేశం మధ్య స్నేహ ఒప్పందంపై సంతకం చేయబడింది.
ఫిలిప్పీన్స్ భారతదేశం సందర్శించవచ్చు?
ఫిలిప్పీన్స్ పౌరులకు భారతదేశాన్ని సందర్శించడానికి వీసా అవసరమా? అవును, ఫిలిప్పీన్స్ పౌరులకు భారతదేశానికి ప్రయాణించే ముందు వీసా అవసరం . ఇండియా ఈవీసా అత్యంత అనుకూలమైన ఎంపిక మరియు రాయబార కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
READ HINDI NEWS : hindi.vaartha.com
Read Also: