భారత్-పాక్ (India-Pakistan) దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లుగా ట్రంప్ (Trump)పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. తాను జోక్యం చేసుకోకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని, దాన్ని తానే ఆపినట్లుగా డాంబికాలు పలుకుతున్న ట్రంప్ తాజాగా మరో మాటను అన్నారు. ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెన్ స్కీతో భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ భారత్-పాక్ యుద్ధం సహా ఆరు యుద్ధాలను ముగించానని అన్నారు. కానీ రష్యా-ఉక్రెయిన్ ల మధ్య ముగించడం సులభమని తాను భావించానని తెలిపారు. కానీ అది కాదని, చాలా కఠినమైనదని చెప్పారు.

ట్రూత్ పోస్ట్ పరోక్షంగా ప్రస్తావన
అంతకుముందు ట్రంప్ తన ట్రూత్ పోస్ట్ లో కూడా భారత్-పాక్ యుద్ధం గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ‘నేను 6నెలల్లో 6 యుద్ధాలను పరిష్కరించాను. వాటిలో ఒకటి సాధ్యమయ్యే అణువిపత్తు’ అని ట్రంప్ పోస్ట్ చేశారు. మే 10న వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. యుద్ధం ఆపకపోతే అమెరికా ఎలాంటి వ్యాపార సంబంధాలు కుదుర్చుకోబోదని తాను హెచ్చరించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంక్షోభాలను తానే నివారించానని ట్రంప్ ప్రకటించుకుంటున్నారు.
చర్చల తర్వాత పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు ఒప్పందం
అయితే రెండు దేశాల సైన్యాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాత పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని భారత్ చెబుతోంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్, తమ నిర్ణయంలో ఎటువంటి విదేశీ జోక్యం లేదని స్పష్టంచేసింది. ఈ అంశంపై లోక్‌సభలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పాకిస్థాన్‌పై దాడులను ఆపాలని తమకు ఏ దేశం చెప్పలేదని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసుకున్న తర్వాతే ఆపరేషన్‌కు విరామం ఇచ్చామని తెలిపారు.
ట్రంప్ కుటుంబం పిల్లలు
ట్రంప్ కు మూడు వివాహాల నుండి ఐదుగురు పిల్లలు ఉన్నారు: డాన్ జూనియర్, ఇవాంకా, మరియు ఎరిక్ ట్రంప్ ఇవానా ట్రంప్ తో; టిఫనీ ట్రంప్ మార్లా మాపుల్స్ తో; మరియు బారన్.
మెలానియా_ట్రంప్
2025 నుండి, మెలానియా ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ప్రథమ మహిళగా సేవలందిస్తున్నారు, గతంలో ఆమె 2017 నుండి 2021 వరకు ఈ పదవిని నిర్వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also :