ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌ను ఇండియా చావు దెబ్బకొట్టింది. ఊహించని ఈ దాడితో ఇప్పటికే పాకిస్థాన్ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఈ క్రమంలోనే గాయంపై కారు చల్లినట్లు, మూలిగే నక్కపై తాటిగాయ పడ్డట్టు.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్‌కు పక్కలో బల్లెంలా మారింది. గురువారం బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బోలాన్, కెచ్ ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత వహించింది. ఈ దాడిలో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు. మొదటి దాడిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (STOS) బోలాన్‌లోని మాచ్‌లోని షోర్కాండ్ ప్రాంతంలో పాక్ సైనిక కాన్వాయ్‌పై రిమోట్-కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) దాడి చేసింది.
బోలాన్, కెచ్ ప్రాంతాల్లో శక్తివంతమైన పేలుళ్లు
శక్తివంతమైన పేలుళ్లలో వాహనంలో ప్రయాణిస్తున్న 12 మంది సైనికులు మరణించారు. వీరిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్ ఉన్నారు. ఈ పేలుడులో సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. రెండవ సంఘటనలో బలూచ్ కార్యకర్తలు కెచ్‌లోని కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

పాక్‌పై ఒత్తిడి – ఉగ్రవాద మద్దతు మానేయాల్సిందే
ఒకవైపు భారత్ తీవ్ర ప్రతీకార దాడులు, మరోవైపు బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల దాడులతో ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలంటే పాకిస్థాన్ తన వ్యూహాలను తిరిగి ఆలోచించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇదే సందు అనుకొని.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ సైనికులపై దాడులకు పాల్పడుతూ.. పాకిస్థాన్‌ను మరింత ఇబ్బంది పెడుతోంది. ఇలా ఒక వైపు ఇండియా, మరోవైపు బలూచిస్థాన్ దాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
Read Also: Donald Trump: భారత్, పాక్ ఉద్రిక్తతలపై మళ్లీ స్పందించిన ట్రంప్