ప్రపంచ భద్రతా వ్యవహారాల్లో భారత్ తనకు అత్యంత కీలకమైన భాగస్వామి అని అమెరికా స్పష్టం చేసింది. చైనా వ్యవహారాలపై ఏర్పాటైన అమెరికా ప్రతినిధుల సభ సెలెక్ట్ కమిటీ(House Select Committee) ఈ మేరకు వ్యాఖ్యానించింది. చైనా దౌర్జన్యాలను నేరుగా ఎదుర్కొంటున్న దేశంగా భారత్ పాత్ర అత్యంత ప్రాముఖ్యత కలిగిందని పేర్కొంది.
ఇటీవల అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వత్రా మరియు కమిటీ అధిపతి జాన్ ములెనార్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, అలాగే చైనాపై ఆధారపడిన కీలక తయారీ రంగాలను ఇతర దేశాలకు తరలించే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపింది.

చైనాపై చర్చలో ప్రధాన అంశాలు
ఈ సందర్భంగా ములెనార్ మాట్లాడుతూ, “చైనా దురాక్రమణకు భారత్ నేరుగా ప్రతిఘటించింది. అందువల్ల ప్రపంచ భద్రతలో భారత్ అమెరికాకు అత్యంత అవసరమైన భాగస్వామి” అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో రక్షణ పరిశ్రమ సంబంధాలు బలపడటం అమెరికా ప్రజల భద్రతకు కూడా ప్రయోజనం కలిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా, ప్రమాదకరమైన చైనా టెక్నాలజీ, సోషల్ మీడియా యాప్‌ల నియంత్రణలో భారత్ ఒక గ్లోబల్ లీడర్‌గా(Global Leader) నిలిచిందని ములెనార్ అభిప్రాయపడ్డారు. గల్వాన్ ఘటనల తర్వాత భారత్ టిక్‌టాక్ సహా అనేక చైనా యాప్‌లను నిషేధించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఈ సమావేశంలో క్వాడ్ కూటమి బలోపేతం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు కమిటీ వెల్లడించింది. భవిష్యత్తులో ఇరు దేశాల పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఈ భాగస్వామ్యం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని భారత రాయబారి క్వత్రా కూడా పునరుద్ఘాటించారు.
అమెరికా భారత్‌ను ఎందుకు కీలక భాగస్వామిగా పరిగణిస్తోంది?
చైనా దౌర్జన్యాలను నేరుగా ఎదుర్కొంటున్నందున ప్రపంచ భద్రతలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తోంది.
భారత రాయబారి వినయ్ క్వత్రా ఎవరిని కలిశారు?
అమెరికా ప్రతినిధుల సభ సెలెక్ట్ కమిటీ అధిపతి జాన్ ములెనార్‌ను కలిశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: