हिन्दी | Epaper

India: వెనిజులా పరిణామాలపై భారత్ ఆందోళన: జైశంకర్

Saritha
India: వెనిజులా పరిణామాలపై భారత్ ఆందోళన: జైశంకర్

గత శనివారం తెల్లవారుజామున అమెరికా (America) అకస్మాత్తుగా వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ (India) తీవ్ర ఆందోళన చెందుతోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. అమెరికా, వెనిజులా ప్రభుత్వాలు చర్చించి ప్రజల శ్రేయస్సు, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. వెనిజులాపై అమెరికా సైనిక చర్య చేపట్టిన ఆనంతరం భారత్ నుంచి వచ్చిన మొదటి ప్రకట ఇదే కావడం గమనార్హం. లక్సెంబర్గ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన జేవియర్ బెట్టెల్ తో జైశంకర్ సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ సహకారంపై ఇద్దరు నేతలు మాట్లాడారు. భారత్, లక్సెంబర్గ్ 78 సంవత్స రాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకున్నట్లు జైశంకర్ తెలిపారు. ఐరోపా సమాఖ్యలో లక్సెంబర్గ్ ను కీలక భాగస్వామిగా భారత్ చూస్తుందని అన్నారు. ‘వెనిజులాతో భారత్ కు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ దేశప్రజలు ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి క్షేమంగా బయటపడాలని మేం ఆకాంక్షిస్తున్నాం’ అని జైశంకర్ అన్నారు.

Read also: Floods: ఇండోనేషియాలో కుండపోత వర్షం..16 మంది మృతి

India: వెనిజులా పరిణామాలపై భారత్ ఆందోళన: జైశంకర్

ఆచితూచి స్పందించిన భారత్

వెనిజులా పై అమెరికా సైనిక దాడిపట్ల, భారత ప్రభుత్వం (India) చాలా జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా స్పందించిందని వెనిజులా మాజీ భారత రాయబారి వై.కె.సిన్హా అన్నారు. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనా దేశాలు తీవ్రంగా అమెరికా దాడిని ఖండించగా, భారత్ మాత్రం చాలా సంయమనంతో కూడిన ప్రకటన చేసిందని ఆయన అన్నారు. కాగా వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా చమురును అమెరికాకు అప్పగిస్తారని.. దాదాపు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. అంటే దీనినిబట్టి వెనిజులా చమురును అమెరికా తన స్వాధీనంలోకి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870