లష్కరే తోయిబా, జైషే మహామ్మద్ (Mohammed) సహా ఐరాస ప్రకటిత ఉగ్రసంస్థలు అఫ్ఘనిస్థాన్లో కార్యకలాపాలు సాగించకుండా చూడాలని ప్రపంచ దేశాలకు భారత్ (India) పిలుపునిచ్చింది. అఫ్ఘనిస్థాన్ పై ఐరాస భద్రతామండలిలో జరిగిన సమావేశంలో ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvataneni Harish) పేర్కొన్నారు. ఆ దేశంలో భద్రతా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఘర్షణలతో దెబ్బతిన్న అఫ్ఘాన్ లో శాంతి, స్థిరత్వానికి కృషి చేసే విషయంలో భారత్ ఆసక్తిగా ఉందన్నారు.

India
హరీశ్ అభిప్రాయపడ్డారు
అఫ్ఘనిస్థాన్ (Afghanistan) తాత్కాలిక విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ రెండుసార్లు చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. అఫ్ఘనిస్థాన్ కు భారత్ (India) తనవంతుసాయం అఫ్ఘనిస్థాన్ కు మానవతసాయంతో పాటు అక్కడి ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నట్లు చెప్పారు. ప్రకృతి విపత్తులు, వ్యాధులు, పేదరికం, ఆహార కొరతవంటి సమస్యలతో బాధపడుతోన్న అఫ్ఘనిస్థాన్ ప్రజలకు సాయం అందించాల్సిన సమయం ఆసనమైందని హరీశ్ అభిప్రాయపడ్డారు. అఫ్ఘనిస్థాన్ కు వెంటనే మానవతా సాయం అందించిన దేశాల్లో భారత్ కూడా ఉందని అన్నారు.
అఫ్ఘనిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలని భారత్ ఏ దేశాలకు పిలుపునిచ్చింది?
ప్రపంచ దేశాలకు భారత్ ఈ పిలుపునిచ్చింది.
అఫ్ఘనిస్థాన్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏవి?
ప్రకృతి విపత్తులు, వ్యాధులు, పేదరికం, ఆహార కొరత.
Read hindi news: hindi.vaartha.com
Read Also: