టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ (Yograj Singh) ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్ జట్టు భారత జట్టుకు సరైన పోటీ ఇవ్వగల సామర్థ్యం లేదు. “భారత జట్టు ఆకాశంలో ఆడుతుంటే పాకిస్తాన్ (Pakistan) నేలపై ఆడుతుంది. ఆకాశం, నేల ఎప్పటికీ కలవలేవు” అని ఆయన చెప్పాడు.అసలు విషయం ఏమిటంటే, ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం (నేడు) దుబాయ్ వేదిక (Dubai venue) గా జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ (India-Pakistan match) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరు జట్ల మధ్య అత్యధిక ఉత్సాహం, టెన్షన్ ఉంటుందన్న విషయం స్పష్టమే.
భారత జట్టే ఫేవరేట్ అని
ఈ సందర్భంలో యోగ్ రాజ్ సింగ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్ అతి బలహీనంగా ఉందని,భారత జట్టే ఫేవరేట్ అని అభిప్రాయపడ్డారు.రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసానికి ప్రధాన కారణం ఐపీఎల్ (IPL) అని తెలిపారు. ఐపీఎల్ భారత క్రికెటర్ల స్థాయిని పెంచిందని చెప్పారు.పాకిస్థాన్ జట్టు ఏం చేయగలదు? భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. ఐపీఎల్ ఎంట్రీతో భారత ఆటగాళ్లు ఎంతో ఎదిగారు. ఎందుకంటే వారికి కావాల్సినంత డబ్బు వచ్చింది.

ఐపీఎల్‌లో డబ్బు ఉంది. ఇది ఆటగాళ్లకు కలిసొచ్చింది. డబ్బు ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది.పాకిస్థాన్, భారత మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ (High voltage match) లేదు. ఇది అసాధ్యం కూడా. ఎందుకంటే పాకిస్థాన్ వేదిక మట్టి. భారత్ ఆడేది ఆకాశం. ఆకాశం, భూమి ఎప్పటికీ కలవలేవు. ఇది సాధ్యం కాదు.’అని యోగ్‌రాజ్ సింగ్ చెప్పుకొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: