పాకిస్థాన్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ (High voltage match) లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్‌లో దాడి చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన టీమిండియా, తర్వాత బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడి 25 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది.
మొదట్లోనే భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు కంగుతిన్నారు. సాహిబ్జాదా ఫర్హాన్ 44 బంతుల్లో 40 పరుగులు చేసి కొంత గౌరవం కాపాడగా, చివర్లో షాహీన్ షా అఫ్రిది 16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్ చేసి జట్టు స్కోరును కాస్త పెంచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) 3/18తో దూకుడు చూపగా, అక్షర్ పటేల్ (2/18), బుమ్రా (2/28) కూడా కీలక వికెట్లు తీశారు. హర్దిక్, వరుణ్ చెరో వికెట్ తీసి పాక్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు.
కానీ షాహిన్ షా అఫ్రిది దూకుడుగా ఆడి
హర్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో పాక్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ షాహిన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi) దూకుడుగా ఆడి పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ వర్మ(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/35) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.

స్వల్ప లక్ష్యచేధనలో టీమిండియా (Team India) కు అదిరిపోయే ఆరంభం దక్కింది. షాహిన్ షా అఫ్రిది వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించిన అభిషేక్ శర్మ.. మరుసటి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. సైమ్ అయుబ్ వేసిన మరుసటి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్(10) కూడా వరుసగా రెండు బౌండరీలు బాది జోరు కనబర్చాడు. కానీ అదే జోరులో అతను స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో 22 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శుభ్‌మన్ గిల్ ఔటైనా.. అభిషేక్ శర్మ తన దూకుడును కొనసాగించాడు.
సూర్యకుమార్ యాదవ్ బర్త్ డే
షాహిన్ అఫ్రిది రెండో ఓవర్‌లో ఓ ఫోర్, సిక్స్‌తో 11 పరుగులు పిండుకున్నాడు. సైమ్ అయుబ్ బౌలింగ్‌లోనూ వరుసగా రెండు బౌండరీలు బాదిన అభిషేక్ శర్మ.. మూడో బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు స్లోగా ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. తిలక్ వర్మ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను మొహమ్మద్ నవాజ్ నేలపాలు చేశాడు.
కానీ ఆ మరుసటి ఓవర్‌లో తిలక్ వర్మను సైమ్ అయుబ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శివమ్ దూబే రాగా.. సూర్య క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సైమ్ అయుబ్ బౌలింగ్‌లో శివమ్ దూబే భారీ సిక్సర్ బాదగా.. సూర్య మరో భారీ సిక్సర్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: