జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాతో క్రికెట్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ గెలవాలంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఓపెనర్లుగా బ్యాటింగ్‌కు దిగాలని ఆయన వ్యంగ్యంగా సూచించారు.ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ (2025 Asia Cup) లో భారత్ చేతిలో పాకిస్థాన్ రెండుసార్లు ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.సోమవారం ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో కలిసిన ఆయన సోదరి అలిమా ఖాన్ (Alima Khan), ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.
భారత్‌పై పాకిస్థాన్ వరుస ఓటముల గురించి
భారత్‌పై పాకిస్థాన్ వరుస ఓటముల గురించి తాను ఇమ్రాన్‌కు చెప్పానని, దానికి ఆయన స్పందిస్తూ ఈ సలహా ఇచ్చారని తెలిపారు. కేవలం ఓపెనర్లు మాత్రమే కాదు, అంపైర్లుగా పాకిస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫాయిజ్ ఈసా (Qazi Faiz Isa), ప్రధాన ఎన్నికల కమిషనర్ సికిందర్ సుల్తాన్ రాజా ఉండాలని ఆయన సూచించినట్లు అలిమా వివరించారు.

ఇక మూడో అంపైర్ బాధ్యతలను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ఫరాజ్ దోగర్‌కు అప్పగించాలని అన్నట్లు ఆమె పేర్కొన్నారు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) తన అసమర్థత, బంధుప్రీతితో పాకిస్థాన్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.
ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు
అదేవిధంగా 2024 ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్, నాటి ప్రధాన న్యాయమూర్తి ఈసా, ఎన్నికల కమిషనర్ రాజా సాయంతో తన పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్’ (పీటీఐ) విజయాన్ని దొంగిలించారని ఆయన చాలాకాలంగా విమర్శిస్తున్నారు.1992లో పాకిస్థాన్‌కు ఏకైక వన్డే ప్రపంచకప్.
అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుతం పలు కేసులలో 2023 ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి ఆయన క్రికెట్ ఓటమిని ఒక అవకాశంగా మలుచుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: