हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : America Shutdown -మన ఆర్థిక వ్యవస్థపై అమెరికా షటెడౌన్ ప్రభావం?

Sudha
Latest Telugu news : America Shutdown -మన ఆర్థిక వ్యవస్థపై అమెరికా షటెడౌన్ ప్రభావం?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన అమెరికాలో ఒక వింత సమస్య తరచుగా తలెత్తుతుంది. అదే ప్రభుత్వ కార్యకలాపాల నిలుపుదల లేదా షటౌన్. ఇది కేవలం తాత్కాలిక పాలనాపరమైన ఇబ్బంది కాదు. రాజ కీయ నాయకులు దేశ బడ్జెట్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతే, దేశ కార్యకలాపాలే ఆగిపోయే ప్రమాదకరమైన సంక్షోభం ఇది. అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే అక్కడి పార్లమెంటు అయిన కాంగ్రెస్ ఖర్చు పెట్టడానికి చట్టపరమైన అనుమతి ఇవ్వాలి. ఈ విధానం యాంటీడిఫిషియెన్సీ చట్టం (ఎడిఎ) అనే పాత చట్టంలో ఉంది. ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు అందించేందుకు పార్లమెంట్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్ను లేదా తాత్కాలిక ఖర్చు బిల్లును ఆమోదించాలి. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి కాంగ్రెస్ ఈ నిధుల బిల్లులను ఆమోదించడంలో విఫలమైతే, ప్రభుత్వంలో అత్య వసరం కాని విభాగాల సేవలు తాత్కాలికంగా మూసివేయ బడతాయి. దీనినే ప్రభుత్వ షట్ డౌన్ అంటారు. గత దశా బ్దాలలో ఈ పరిస్థితి తరచుగా సంభవించడం పెరిగింది. ఇది ఒక సాధారణ ప్రక్రియ లోపం కాస్తా, అపారమైననష్టం కలిగించే శక్తివంతమైన రాజకీయ అస్త్రంగా మారింది. కొన్ని నిధులను ఆమోదించి, మరికొన్నింటిని ఆమోదించకపోతే అది పాక్షిక పటౌడౌన్ అవుతుంది. ఇదిఅధ్యక్షుడు ఇష్ట పూర్వకంగా తీసుకునే నిర్ణయం కాదు. బడ్జెట్ కేటాయింపుల్లో కాంగ్రెస్ విఫలమైనప్పుడు చట్టంప్రకారం స్వయంచాలకంగా జరిగే ప్రక్రియ ఇది. అందుకే, ఈ వైఫల్యానికి కారణం, పరిష్కారం రెండూ కాంగ్రెస్ చేతుల్లోనే ఉంటాయి. నిజనికి, ఈ చట్టాన్ని డబ్బు వృథా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో తెచ్చారు. కానీ ఇప్పుడు, రాజకీయ పార్టీలు తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకోవడం ద్వారా దీనిని ఒక రాజకీయఒత్తిడి సాధనంగా ఉపయోగిస్తున్నాయి. అంటే, డబ్బును నియం త్రించే చట్టం, ప్రభుత్వ కార్యకలాపాలను ఆపేసే సాధనంగా మారిందన్నమాట. ఎటెడౌన్కు అసలు అధికారం అమెరికా రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో ఉంది.

America Shutdown  -మన ఆర్థిక వ్యవస్థపై అమెరికా షటెడౌన్ ప్రభావం?
America Shutdown -మన ఆర్థిక వ్యవస్థపై అమెరికా షటెడౌన్ ప్రభావం?

రాజకీయ విభేదాల ఫలితం

యుఎస్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1,సెక్షన్ 9, క్లాజ్ 7 ప్రకారం, ‘చట్టం ద్వారా చేసిన కేటాయింపులు పర్యవసానంగా తప్ప, ఖజానా నుండి డబ్బు తీయరాదు.’ ప్రభుత్వ ఖజానాపై అంతిమ అధికారం పూర్తిగా కాంగ్రెస్కే చెందుతుంది. దీని అర్థం. ప్రభుత్వ కార్యకలాపాలు సాగడానికికాంగ్రెస్ డబ్బు ను ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోతే, చట్టబద్దంగా కార్యకలాపాలు ఆగిపోతాయి. కాంగ్రెస్ నిధులను ఆమోదిం చడంలో విఫలమైతే, చట్టాన్ని గౌరవించి, ఖర్చును ఆపడం తప్పనిసరి. అందుకే, షట్ డౌన్ ( America Shutdown )అనేది బడ్జెట్ ఆమోదం విఫలమైనప్పుడు ఆటోమేటిక్ గా సంభవించే ఒక పరిణామం. ఈ షట్గా డౌన్కు ప్రధాన కారణం పార్టీల మధ్య-ఉన్న తీవ్రమైనవిభేదాలు. ఈ సంక్షోభం కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇది తీవ్రమైన రాజకీయ విభేదాల ఫలితం. ఉదాహరణకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు, డెమొ క్రాట్పార్టీ మరోవైపు మొండి పట్టుదలకుపోవడం ఈ సంక్షోభానికి దారితీస్తుంది. సాధారణంగా, ఆరోగ్య సంరక్షణ నిధు లు అంటే మెడికేయిడ్ కోతలు, వలస విధానాలు వంటి కీలక అంశాలపై రాజకీయ డిమాండ్లను నిధుల బిల్లుకు జతచేయాలని డెమోక్రాట్లు ప్రయత్నించడంవల్ల ప్రతిష్టంభన ఏర్పడుతుంది. డెమొక్రాట్లు ఆరోగ్య సంరక్షణ పథకాలకు నిధులు కొనసాగించాలని పట్టుబడుతుంటే, అధ్యక్షుడు ట్రంప్ దీన్ని తన రాజకీయ ఆయుధంగా వాడుకుంటారు. డెమొ క్రాట్ల పాలనలోని రాష్ట్రాలకు కేటాయించిన అభివృద్ధి నిధు లను నిలిపివేయడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని తొలగిస్తానని బహిరంగంగా బెద రించడం వంటి చర్యలు అమెరికా రాజకీయాల స్థాయిని దిగజార్చాయి. 1980 తరువాత పాత ఎడిఎ చట్టాన్ని కఠి నంగా అమలు చేయడం మొదలుపెట్టాక షట్లెడౌన్లు ( America Shutdown )తప్పనిసరి అయ్యాయి. ఈ విధంగా, బడ్జెట్ కేటాయింపుల్లో కాంగ్రెస్ వైఫల్యం చెందితే, ఆ పరిణామాలకు కారణం, పరిష్కారం రెండూ కాంగ్రెస్ చేతుల్లోనే ఉంటాయి. 1976వ సంవత్సరం నుండి అమెరికా 20 సార్లకు పైగా నిధుల కొరతను ఎదుర్కొంది. ఈ సమస్య ఇప్పుడు మరింత తర చుగా, ఎక్కువ రోజులు కొనసాగుతోంది. ఇది రాజకీయ నాయకులు పార్టీ ప్రయోజనాలను దేశ పాలన కంటే ముఖ్యమని భావిస్తున్నారనడానికి నిదర్శనం.

చారిత్రక ఉదాహరణ

చారిత్రక ఉదాహరణలను పరిశీలిస్తే, 1996లో బిల్ క్లింటన్అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 21 రోజులు ఈ షట్లెడౌన్ కొనసాగింది. 2013లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని రద్దుచేయాలనే డిమాండ్పై 16 రోజుల పాటు టౌన్ జరిగింది. ఇక, 2018-19లో డొనాల్డ్ ట్రంప్అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు ఇవ్వాలనే డిమాండ్లో రికార్డు స్థాయిలో 35 రోజు లు షట్లె డౌన్ ( America Shutdown ) జరిగింది. షట్ డౌన్ జరిగినా, ప్రాణాలు, ఆస్తు లను కాపాడే జాతీయ భద్రత, పోలీసు సేవలు వంటివి కొనసాగుతాయి.సామాజిక భద్రత వంటి తప్పనిసరి కార్య క్రమాల నిధులు కూడా ఆగవు. అయితే, ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులు జీతం లేకుండా పనిచేయాలి. ఫెడరల్ పార్కులు, శాస్త్రీయ పరిశోధన, కొన్ని ప్రభుత్వ అనుమతు లు ఇచ్చే కార్యాలయాలు మూసివేయబడతాయి. దాదాపు 7.5 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేకుండా బలవంతంగా సెలవులో ఉండాల్సి వస్తుంది. రోజుకు సుమా రు 400 మిలియన్ల డాలర్ల జీతం నష్టం జరుగుతుంది. జీతం తిరిగి వచ్చినప్పటికీ, ఈ మధ్యలో వచ్చే ఆర్థిక కష్టాలు, ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితి ఇబ్బంది పెడుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు పోయిన జీతం తిరిగిరాదు. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి, ఇక్కడి ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లు, విదేశీ మారక మార్కెట్లు, వస్తువుల మార్కెట్లలో అస్థిరత పెరుగుతుంది. అమెరికా ప్రభుత్వం తన బడ్జెట్ను నిర్వహించలేకపోవడం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుం ది. ఇది ప్రపంచ పెట్టుబడుల ప్రవాహాన్ని తగ్గిస్తుంది.

America Shutdown  -మన ఆర్థిక వ్యవస్థపై అమెరికా షటెడౌన్ ప్రభావం?
America Shutdown -మన ఆర్థిక వ్యవస్థపై అమెరికా షటెడౌన్ ప్రభావం?

ద్రవ్యోల్బణం

అంతే కాక, ద్రవ్యోల్బణంవంటి కీలక ఆర్థికసమాచారాన్ని సేకరించే సంస్థలు ఆగిపోతాయి. ఈ సమాచారం లేకపోవడం వల్ల, ప్రపంచ బ్యాంకులతోసహా అంతర్జాతీయ సంస్థలు, ఫెడరల్ రిజర్వ్ వంటివి సరైన నిర్ణయాలు తీసుకోలేవు. షటౌన్ ఎక్కువకాలం కొనసాగితే, అమెరికా వృద్ధి మందగించడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.తరచుగా షట్లెన్లు రావడం వల్ల, అమెరికా ఒక స్థిరమైన, నమ్మదగిన దేశం అనే పేరును కోల్పోతుంది. అంతర్జాతీయ సహాయకార్యక్రమాలు, వీసాప్రక్రియలు వంటి వి ఆగిపోవడంవల్ల విదేశీ సంబంధాలు దెబ్బతింటాయి. అత్యంత తక్షణ, బాధాకరమైన ప్రభావం హెచ్1బి వీసా, గ్రీన్ కార్డ్ ప్రక్రియల్లో ఏర్పడిన అంతరాయం. నిధుల కొరత కారణంగా యుఎస్ కార్మికశాఖలోని ఫారిన్ లేబర్ సర్టిపికేషన్ కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుంది. కొత్త హెచ్ 1బి వీసా పిటిషన్నుదాఖలు చేయడానికి లేదా ఉద్యోగాన్ని మార్చడానికి, ముందుగా లేబర్ కండిషన్ అప్లి కేషన్ను డీఓఎల్ ధృవీకరించాలి.ఓఎఫ్ఎసీ పనిచేయక పోవడంతో కొత్త ఎల్సీలు దాఖలు చేయడానికి వీలులేకుండా పోయింది. దీని అర్థం హెచ్ 1బి వ్యవస్థనుండి అత్యధికం గా లబ్ధి పొందుతున్న నైపుణ్యం గల భారతీయ నిపుణులు వేలాది మంది అనిశ్చితిలో చిక్కుకున్నారు. వారిఉద్యోగ మార్పిడులు, కొత్త నియామకాలు నిరవధికంగా ఆగిపోయా యి. అదేవిధంగా, శాశ్వత నివాసానికి అవసరం అయినగ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రక్రియ కూడా స్తంభించింది. ఈ ప్రక్రియకు కూడా డీఓఎల్ నుండి ధృవీకరణలు లేదా ప్రస్తుత వేతనాల నిర్ధారణలు అవసరం. ఇది ప్రవాస భారతీయు లకు ఇప్పటికే కఠినంగా ఉన్న నిరీక్షణ సమయాన్ని మరింత పెంచుతోంది. ఎట్ డౌన్ ఎక్కువ కాలం కొనసాగితే అమెరి కన్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటాయి. దీనివల్ల మన దేశ ఐటీ సేవలఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి పెరిగి, భారత స్టాక్ మార్కెట్లునష్టపోవడం, రూపాయి విలువ తగ్గడం వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు.
-డి జయరాం

యుఎస్ షట్డౌన్లో ఏమి జరుగుతుంది?

ప్రభుత్వ షట్‌డౌన్ సమయంలో, ఇన్‌పేషెంట్ మరియు అత్యవసర వైద్య సంరక్షణ, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, చట్ట అమలు, సరిహద్దు భద్రత, విపత్తు సహాయం మరియు పవర్ గ్రిడ్ నిర్వహణ వంటి జాతీయ భద్రత మరియు ప్రజా భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సేవలు కొనసాగుతాయి, అయినప్పటికీ అవి అంతరాయాలను ఎదుర్కొంటాయి.

షట్డౌన్ ప్రభావం ఏమిటి?

సాధారణంగా, ప్రభుత్వ షట్‌డౌన్ అంటే లక్షలాది మంది ఫెడరల్ కార్మికులను తొలగించడం జరుగుతుంది. సర్వీస్ సభ్యులు, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, TSA ఏజెంట్లు మరియు బోర్డర్ పెట్రోల్ ఉద్యోగంలో కొనసాగుతారు కానీ జీతం లేకుండా పని చేయవలసి వస్తుంది. విపత్తు ఉపశమనం మరియు పర్యావరణ పరిరక్షణ నిలిచిపోతాయి

Read hindi news: hindi.vaartha.com

Epaper :https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

📢 For Advertisement Booking: 98481 12870