అహ్మదాబాద్(Ahmedabad) లో గురువారం జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన, గాయపడిన వైద్య (Medical) విద్యార్థులకు, ఇతర బాధితులకు సమగ్రమైన సహాయ సహకారాలు అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) (IMA) శనివారం విజ్ఞప్తి చేసింది. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ అయిన టాటా సన్స్ (Tata sons) ఈ విషయంలో తక్షణమే స్పందించాలని కోరింది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా వైద్య వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రమాదానికి గురైన విమానం: ఎయిర్ ఇండియా AI-171
ఈనెల 19న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ171 (బోయింగ్ 787-8) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో విమాన శకలాలు సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ డైనింగ్ ఏరియాపై పడటంతో పెను విషాదం చోటుచేసుకుంది.

వైద్య విద్యార్థుల దుర్మరణం – ఐఎంఏ ఆవేదన
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎంఏ.. మరణించిన వైద్య విద్యార్థుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు గాయపడిన వారికి దీర్ఘకాలిక మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. టాటా సన్స్(Tata sons) ఈ బాధ్యతను స్వీకరించాలని ఐఎంఏ కోరింది.
బాధితుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
ఈ ఘోర ప్రమాదం మానవీయ, విద్యా, ఆరోగ్య అంశాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.
టాటా గ్రూప్, ప్రభుత్వం, వైద్య సంస్థలు కలిసి బాధితుల పట్ల సహానుభూతి చూపిస్తూ, సహాయ చర్యలు పారదర్శకంగా తీసుకోవాలని, ఐఎంఏ, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఏకస్వరం గా డిమాండ్ చేస్తున్నాయి.
Read Also: Shubhanshu Shukla: 19న అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా