ఒమన్ గల్ఫ్‌లో భారీ మొత్తంలో చమురును(Illegal OilTransport) తరలిస్తున్న నౌకను ఇరాన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నౌకలో మొత్తం 18 మంది సిబ్బంది ఉన్నారు, ఇందులో భారతీయులు, బంగ్లాదేశ్, శ్రీలంక పౌరులూ ఉన్నారని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
Read Also: Donald Trump: భారత్‌పై సుంకాల వ్యవహారం.. ట్రంప్ నిర్ణయానికి కాంగ్రెస్ వ్యతిరేకం

నౌకలోని చమురు పరిమాణం
ఇరాన్ మీడియా ప్రకారం, నౌకలో సుమారు 60 లక్షల లీటర్ల చమురును(Illegal OilTransport) అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించడంతో అదుపులోకి తీసుకున్నారు. భద్రతా బలగాలు చేరతానే నౌకలోని నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేశామని కూడా పేర్కొన్నారు.
ఇరాన్‌లో ఇంధన ధరలు తక్కువగా ఉండటంతో, కొందరు అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు చమురును తరలిస్తూ భారీ లాభాలు పొందుతున్నారు. ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం ఇరాన్ నిరంతరం గస్తీలు నిర్వహిస్తోంది.
వెనెజువెలా–ఇరాన్ నౌకల సంఘటన
గత రెండు రోజుల క్రితం, వెనెజువెలా తీరంలో ఒక ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా సీజ్ చేసింది. ఇరాన్, వెనెజువెలా(Venezuela) నుంచి అక్రమంగా చమురు తరలిస్తున్నారన్న ఆరోపణలతో ఆ నౌకను నిలిపినట్లు అమెరికా పేర్కొంది. ఈ పరిణామం వెంటనే ఇరాన్ కూడా ఒమన్ గల్ఫ్‌లోని ఒక నౌకను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :