దేశం నుంచి తాము విడిపోతామని, స్వాతంత్రం కావాలంటూ బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థలు (Balochistan Army) పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా రెండు రకాలుగా తమపై దాడి జరుగుతుండగా.. పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయం అని.. తమకు ఇప్పుడు భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తామంటూ బలూచ్ ఆర్మీ ప్రధాని మోదీకి తెలిపింది. ఆయుధాలు, మిస్సైల్స్ ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా కోరింది.

పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను కొనసాగిస్తుండగానే.. మరోవైపు ఆ దేశానికి బలూచ్ వేర్పాటువాద సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పాక్ సైన్యంపై దాడులు చేస్తూ.. ఇప్పటికే 46 శాతం భూమిని ఆక్రమించుకున్నాయి. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిడి వస్తుండగా దాయాది దేశం అల్లాడిపోతుంది. అయితే ఈ సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విన్నపం చేసింది. సోషల్ మీడియా వేదికగా తమకు సాయం చేయాలని.. ఆయుధాలు, మిస్సైల్స్ ఇస్తే పాక్ అంతు చూస్తామని చెప్పుకొచ్చింది. పాక్‌తో పోరాడడానికి ఇదే సరైన సమయం అని వెల్లడించింది.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రజలంతా.. దాయాది దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉండే బలూచిస్థాన్ ప్రాంతంపై పాక్ పెత్తనాన్ని చెలాయిస్తోందని చెబుతున్నారు. అయిల్, గ్యాస్, ఖనిజాల విపరీతంగా ఉన్నప్పటికీ.. స్థానికులకు వాటి ఫలితాలను అందించడం లేదని పేర్కొంటున్నారు. పాక్ సర్కారు ఈ వనరులను ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం ఎక్కువగా వాడుతోందని.. ఫలితంగా బలూచ్ ప్రజలంతా పేదరికంలో మగ్గిపోవాల్సి వస్తుందని వవివరిస్తున్నారు. ఈక్రమంలోనే తామే ఓ ప్రత్యేక దేశంగా మారుతామని చెప్పుకొస్తున్నారు.
Read Also : India Pakistan War: రెండు పాక్ జెట్స్‌ను గాల్లోనే పేల్చేసిన భారత్