
హాంకాంగ్‌లో (Hongkong) ని తైపో ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. వాంగ్ ఫక్ కోర్టు అనే నివాస సముదాయంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ అగ్ని ప్రమాదం లో, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 94 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 76 మంది తీవ్రగా గాయపడ్డారు. మరో 280 మంది ఆచూకీ లభించడం లేదు. 48 గంటలు గడిచాయి..304 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Read Also: Putin Ukraine war :యుక్రెయిన్ వెనక్కి తగ్గితే యుద్ధం ఆపుతాం: ఒక్క షరతుతో పుతిన్ ప్రకటన…
అయినా కూడా ఇంకా మంటలు అదుపులోకి రావడం లేదు. మంటలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు 5జీ, గన్ పౌడర్, ఏఐ, ఫ్లైయింగ్ కార్స్, కృత్రిమ వర్షం లాంటి అధునాతన పద్ధతులను ఉపయోగించారు. కానీ ఏమీ ఫలితం లేకపోయింది. 77 ఏళ్ళల్లో చైనా (China) లో ఇదే అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదం అని చెబుతున్నారు.
కన్‌స్ట్రక్షన్ సమయంలో వాడిన నెట్ తొలగించలేదు
ఇది తాయ్ పో జిల్లాలో ఒక పెద్ద గృహ సముదాయం. ఆ నివాస సముదాయంలో మొత్తం 2వేల ఇళ్ళు ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.7, అపార్ట్‌మెంట్లలో 4,800 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌ల బయటి గోడల నిర్మాణం వెదురు బొంగుతో చేశారు. అదేవిధంగా కన్‌స్ట్రక్షన్ సమయంలో వాడిన నెట్ తొలగించలేదు. మంటలు వ్యాపించే సమయంలో భారీగా గాలులు వీయడం వల్ల అగ్నికీలలు ఇతర టవర్లకూ పాకి, అవి కూడా తగలబడ్డాయి.
మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దాదాపు 304మంది సిబ్బంది రెండు రోజులుగా కష్టపడుతున్నారు. అయితే వారు అక్కడ చాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండడంతో బాధితుల దగ్గరకు చేరుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఒక సిబ్బంది మరణించారు కూడా. ఈ కారణంగా ఇప్పటికీ చాలా మంది ఆ భవనాల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది. 300 మంది ఆచూకీ దొరకడం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: