हिन्दी | Epaper

Latest Telugu News: Fine: అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

Vanipushpa
Latest Telugu News: Fine: అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Trump) పదవీ బాధ్యతలు స్వీకరించిప్పటి నుంచి.. ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్న వేలాది మందిని ఇప్పటికే ప్రత్యేక విమానాల ద్వారా తమ దేశాలకు తరలించారు. అయినా ఇంకా కొంత మంది అక్కడే ఉన్నారని తెలుసుకుని.. తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించిన ప్రతీ ఒక్క వలసదారుడికి భారీ జరిమానా విధించనున్నారు. 14 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పత్రాలు లేని వలసదారులపై 5,000 డాలర్లు (భారత కరన్సీ ప్రకారం సుమారు రూ.4.49 లక్షలు) జరిమానా పడుతుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.

Read Also: DRDO: లక్షన్నర జీతాలతో డీఆర్‌డీఓలో భారీగా ఉద్యోగాలు

US
US

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’

ఈ జరిమానాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ కింద ఆమోదించారు. సెప్టెంబర్‌లో నెలలోనే ఈ చట్టం అమలు చేసినప్పటికీ.. అప్పుడు జరిమానా కేవలం 1000 డాలర్లుగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 5,000 డాలర్లకు పెంచారు. ఈ 5,000 డాలర్లు రుసుమును ‘పట్టుబడినందుకు రుసుముగా’ పరిగణిస్తారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన.. 14 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ జరిమానా చెల్లించాలి. అయితే ఇది సరిహద్దు ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.

చెల్లించకపోతే ఏమవుతుంది?

ఎవరైనా ఈ 5,000 డాలర్ల రుసుమును చెల్లించలేకపోతే.. ఆ మొత్తం యూఎస్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అధికారిక అప్పుగా మారుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తెలిపింది. ఈ అప్పు రికార్డులో నమోదై ఉంటుంది. దీని వల్ల భవిష్యత్తులో ఆ వ్యక్తి చట్టబద్ధంగా యూఎస్‌లోకి ప్రవేశించడానికి లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు పొందడానికి వీలు లేకుండా పోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

📢 For Advertisement Booking: 98481 12870