గతకొన్ని మాసాలుగా హమాస్ (Hamas) ఇజ్రాయెల్ బీకర దాడులు చేస్తున్నది. ఇజ్రాయెల్ ప్రజలను హమాస్ హతమార్చడం, 50 మంది బందీలను ఇంకా విడుదల చేయని కారణంగా ఇజ్రాయెల్ హమాస్ పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఇందులో భాగంగా హమాస్ (Hamas) అధినేత యాహ్యా సిన్వార్ గతేడాది మరణించిన విషయం విధితమే. అయితే సిన్వార్ మరణం తర్వాత ఆయన భార్య సమర్ మహమ్మద్ అబూ జమర్ తన పిల్లలతో కలిసి ఓ నకిలీ పాస్ పోర్ట్ (Fake passport) ద్వారా టర్కీకి పారిపోయినట్లు తెలుస్తోంది. అక్కడ సమర్ మరో వివాహం కూడా చేసుకున్నట్లు ఇటీవల ఇజ్రాయెల్ వెల్లడించింది. సమర్కు సిన్వార్తో 2011లో పెళ్లి జరిగింది. నకిలీ పాస్పోర్టు ద్వారా పరార్ కాగా ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడంతో సిన్వార్ మృతిచెందాడు. దీంతో ఆమె హమాస్ ఉన్నతాధికారుల సాయంతో గాజాలోని ఓ మహిళ పాస్ పోర్ట్ ను వాడుకుని మొదట ఈజిప్టుకు వెళ్లింది. అనంతరం అక్కడ నుంచి టర్కీకి వెళ్లింది. అక్కడ ఆమె పెళ్లి చేసుకోవడానికి రాజకీయ బ్యూరోలోని సీనియర్ అధికారి ఫాతి హమ్మద్ (Fathi Hammad) సాయం చేసినట్లు తెలుస్తోంది.

హమాస్ అధినేత సిన్వార్ హత్యపై డీఎన్ఏ ధృవీకరణ, ట్రంప్ ప్రకటనలతో ఉద్రిక్తతలు
యాహ్యా సిన్వార్తోపాటు తన సోదరుడు మహమ్మద్ సిన్వార్ కూడా మరణించాడు. ఇతను చనిపోయిన తర్వాత యాహ్యా భార్య నజ్వా కార్యాలయంలో నకిలీ పాస్పోర్టులను తయారు చేసే విభాగానికి అధిపతిగా ఉంది. ఆ తర్వాత సిన్వార్ కూడా మృతి చెందడంతో గాజా వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. 2023 నుంచి కొనసాగుతున్న దాడులు హమాస్ ఉగ్రవాదులు 2023లో ఇజ్రాయెల్పై దాడులు చేశారు. ఈ దాడుల్లో 1200 మంది మృతి చెందగా, 250 మందిని హమాస్ బందీలుగా చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులను చేస్తూనే ఉంది. ఇటీవల ట్రంప్ హమాస్ను కాల్పుల విరమణకు రావాల్సిందిగా కోరగా హమాస్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో కోపోద్రేకుడైన ట్రంప్ హమాసు అంతం చేయమని ఇజ్రాయెల్కు సూచించింది. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి అయిన హమాస్ అధినేత సిన్వార్ను హతమార్చాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ గాజాపై గతేడాది దాడులు జరపగా సిన్వార్ మరణించాడు. డీఎన్ఏ పరీక్ష ద్వారా ఈ విషయాన్ని ఇజ్రాయెల్ దృవీకరించుకుంది.
హమాస్ అంటే ఏమిటి మరియు ఎందుకు సృష్టించబడింది?
హమాస్ (లేదా ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్) అనేది పాలస్తీనాకు చెందిన సున్నీ ఇస్లామిస్ట్ సైనిక మరియు సామాజిక రాజకీయ ఉద్యమం మరియు US నియమించబడిన విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO). హమాస్ యొక్క ప్రాథమిక కార్యాచరణ మరియు మద్దతు గాజా స్ట్రిప్‌లో ఉంది, దీనిని 2007 నుండి అది నియంత్రిస్తోంది.
హమాస్ దేని కోసం పోరాడుతోంది?
హమాస్ పాలస్తీనా భూభాగాల్లో అతిపెద్ద మరియు అత్యంత సమర్థవంతమైన మిలిటెంట్ గ్రూప్ మరియు అతిపెద్ద రాజకీయ పార్టీ. హమాస్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనకు మరియు పాలస్తీనా రాజ్య సృష్టికి కట్టుబడి ఉంది.
ప్రస్తుతం హమాస్ అధ్యక్షుడు ఎవరు?
అయితే, 6 ఆగస్టు 2024న, యాహ్యా సిన్వర్ అధికారికంగా హమాస్ పొలిటికల్ బ్యూరో తదుపరి ఛైర్మన్‌గా మరియు హమాస్ వాస్తవ నాయకుడిగా నియమితులయ్యారు, అతని పూర్వీకుడు ఇస్మాయిల్ హనియే హత్య జరిగిన ఆరు రోజుల తర్వాత.
Read hindi news: hindi.vaartha.com
Read also: Amina Begum: దుబాయ్ వెళ్లిన పాతబస్తీ మహిళ డ్రగ్స్ కేసులో అరెస్టు