అమెరికా వెళ్లాలనుకునే హెచ్-1బీ వీసా (H-1B visa) దరఖాస్తుదారులకు ట్రంప్ (Trump) సర్కారు భారీ షాకిచ్చింది. అమెరికా విదేశాంగశాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. డిసెంబరు 15 నుంచి అన్ని హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన హెచ్-4 వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడం ప్రారంభించింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అధికారులు వలస విధానాలను మరింత కఠినతరం చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read Also: Plane Crash: మెక్సికోలో కుప్పకూలిన విమానం-ఏడుగురు దుర్మరణం

వీసా ఒక ప్రత్యేక హక్కు
అమెరికా విదేశాంగశాఖ ప్రకారం.. యుఎస్ వీసా అనేది ఒక హక్కు కాదు, అది ఒక ప్రత్యేక హక్కు మాత్రమే. దేశ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పుగా మారే అవకాశమున్న వ్యక్తులను ముందుగానే గుర్తించడమే ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ లక్ష్యమని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. డిసెంబరు 3న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హెచ్-1బీ, హెచ్-4 వీసాలకే కాకుండా ఎఫ్, ఎం, జె నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలు గోప్యతా సెట్టింగులను పబ్లిక్ గా మార్చాల్సి ఉంటుంది. ఈ ఆన్ లైన్ ఉనికిని పరిశీలించి, వీసా మంజూరు చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు.
భద్రతకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఇక వీసా రానట్టే
అమెరికా (America) జాతీయ భద్రతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, హింసాత్మక లేదా ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాద సంస్థలకు మద్దతు వంటి అంశాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు సోషల్ మీడియా పోస్టులను పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హెచ్-1బీ వీసాలలో 70శాతానికి పైగా భారతీయులకే మంజూరవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3 లక్షలమంది భారతీయులు హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది ఐటీ, టెక్నాలజీ, సేవల రంగాల్లో ఉన్నారు.
భారతీయులకే అధిక ప్రభావితం
సోషల్ మీడియా స్క్రీనింగ్ అమలులో భారతీయ దరఖాస్తుదారులే ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే.. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు అనేక వీసా ఇంటర్వ్యూలను రీషెడ్యూల్ చేశాయి. హెచ్-1బీ, వాచ్-4 దరఖాస్తుదారులు భారత్ లోనే చిక్కుకుపోయారు. కొందరి ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా గందరగోళానికి గురవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: