కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో(Gustavo Petro) వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే, అప్పుడు ఆయుధాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. వెనిజులా దేశాధ్యక్షుడు మదురోను నిర్బంధించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు లాటిన్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. కొకైన్ మాదకద్రవ్యాన్ని ట్రాఫికింగ్ చేసినట్లు పెట్రోపై ఆరోపణలు చేశారు. ఆయన్ను కూడా త్వరలో పదవీచ్యుతున్ని చేయనున్నట్లు ట్రంప్ తన వార్నింగ్‌లో పేర్కొన్నారు. కొలంబియాపై సైనిక చర్య చేపట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలో గుస్తావో పెట్రో (Gustavo Petro) తన ఎక్స్‌లో రియాక్ట్ అయ్యారు. నేనేమీ మిలిటరీ వ్యక్తిని కాదు అని, కానీ యుద్ధం గురించి తెలుసు అని, 1989లో జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం ఆయుధాన్ని పట్టుకోను అని, కానీ స్వదేశం కోసం మాత్రం ఆయుధాన్ని చేతబూనాల్సి వస్తుందని పెట్రో అన్నారు. 2022లో కొలంబియా వామపక్ష అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఎం-19 కమ్యూనిస్టు గెరిల్లా గ్రూపులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 1980 తర్వాత ఆయుధాలు వీడి, కొలంబియా ప్రధాన రాజకీయాల్లో చేరారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత కొకైన్ ట్రేడ్‌ను అణిచివేశారు.
Read Also: America: వెనిజులాకు నేనే ‘అధికారి’: ట్రంప్

కోకా ఆకు చెట్ల పంటను అడ్డుకున్నామని, కోకా పంట వేయాన్ని నిలిపివేశామని, దాని స్థానంలో ఇతర పంటలు వేసేలా ప్రోత్సహించినట్లు చెప్పారు. అయితే స్థానికంగా ఉన్న డ్రగ్ కార్టెల్స్‌పై సర్జికల్ దాడులు చేశామని, పిల్లలు.. రైతులకు నష్టం జరగవద్దు అని ఆ తరహా వైమానిక దాడులు చేసినట్లు చెప్పారు. వెనిజులాపై అమెరికా చేసిన దాడిని కొలంబియా, క్యూబా దేశాలు ఖండించాయి. వెనిజులాపై జరిగిన దాడిని రష్యా కూడా ఖండించింది. మదురోతో పాటు ఆయన భార్యను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: