మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. అరబ్ దేశాల భూభాగాలపై ఇరాన్ వరుస దాడులకు పాల్పడుతుండటంతో గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని అతిపెద్దదైన షైబా ఆయిల్ ఫీల్డ్‌పై జరిగిన దాడిని సౌదీ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి అటాక్స్ కొనసాగిస్తే టెహ్రాన్ (ఇరాన్) భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇది భవిష్యత్తులో రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీస్తుందని సౌదీ పాలకులు హెచ్చరించారు.
T20 World Cup : టీమ్ ఇండియా ఘన విజయం
మరోవైపు, ఇరాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఖతర్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒకవైపు శాంతి మంతనాలు జరుపుతున్నామని, దాడులు చేయడం లేదని చెబుతూనే.. మరోవైపు డ్రోన్లతో విరుచుకుపడుతూ ఇరాన్ తమను మోసం చేసిందని ఖతర్ ఆవేదన వ్యక్తం చేసింది. నిరంతరాయంగా జరుగుతున్న ఈ డ్రోన్ దాడులు గల్ఫ్ ప్రాంతంలోని ఆర్థిక స్థిరత్వాన్ని మరియు చమురు సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని అరబ్ దేశాలు ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోకుంటే ఈ ఉద్రిక్తతలు ప్రాంతీయ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
T20 World Cup: సంబరాల్లో భారత్
ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఇరాన్ వైఖరిలో మార్పు రాకపోతే ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో పాటు, దౌత్యపరంగా ఆ దేశాన్ని ఏకాకిని చేసేందుకు సౌదీ, ఖతర్ మరియు ఇతర మిత్రదేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. చమురు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ తన డ్రోన్ దాడులను తక్షణమే నిలిపివేసి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని గల్ఫ్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com